ఎపికి అన్యాయం: కువైట్‌లో తెలుగు సంఘాల నిరసన

హైదరాబాద్: ఏపి డిమాండ్స్ జస్టిస్ అనే నినాదంతో కువైట్‌లొ తెలుగుదేశం కువైట్, తెలుగు సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఒమేరియ పార్కులో నిర్వహించారు.

తెలుగు దేశం కువైట్ అధ్యక్షుడు, తెలుగు సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ కుదరవల్లి సుధాకర రావు ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ తెలుగు సంఘాల అధ్యక్షులతో పాటు తెలుగు దేశం కువైట్ నాయకులు పాల్గొని కేంద్రప్రభుత్వ వైఖరిని ఖండించారు.

తెలుగు రాష్ట్రాల విభజన సమయములో ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని, అంధ్ర ప్రదేశ్ ను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ప్రత్యేక హోదా గానీ ప్రత్యేక ప్యాకేజిని గానీ వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Telugu associations in Kuwait protest against Centre's injustice meeted out AP

వచ్చే ఎన్నికలలో కూడా మోడి చంద్రబాబు కాంబినేషన్ ను ప్రజలు కోరుకుంటున్నారని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ను అన్నిరకాలుగా ఆదుకొని 2019 లో వచ్చే ఎన్నికలలో కుడా కలసి పనిచేసి అటు భారతదేశాన్ని ఇటు అంధ్ర ప్రదేశ్ ను అభివ్రుద్ది పథంలో దూసుకువెళ్ళేలాగా నాయకత్వం వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మోహన్ బాబు, మేముసైతం నాగముని, వడియరాజుల సేవా సంఘం తురక వెంకట సుబ్బయ్య, అమ్మ హెల్పింగ్ హ్యండ్స్ ప్రభాకర్ యాదవ్, తెలుగు దేశం కువైట్ నాయకులు మద్దిన ఈశ్వర్ నాయుడు, సుబ్బా రెడ్డి, ముస్తాక్ ఖాన్, బత్యాల సేవా సమితికి చెందిన బాలాజి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+