లిబియాలో తెలుగు లెక్చరర్ హత్య

ఆయన స్వస్థలం అనంతపూర్ జిల్లా. ఆయనకు భార్య రషీదా నస్రీన్, ఓ కుమార్తె ఉంది. లిబియా దేశానికి వెళ్లకముందు ఆయన గోల్కొండ చౌరస్తాలో నైస్ స్టడీ సర్కిల్ పేరిట పోటీపరీక్షల శిక్షణా సంస్థను నిర్వహించేవారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల వరకు భార్యతో ఫోన్‌లో మాట్లాడిన నజీముద్దీన్ రేపు మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేశారు.
అయితే రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆయన నివసించే అపార్ట్‌మెంట్ కాలనీలోనే నివసించే 16 ఏళ్ల బాలుడు అతని ఇంట్లోకి చొరబడి చాకుతో నజీముద్దీన్‌ను పొడిచి చంపేశాడు. ఇంట్లోని నగలు, నగదు తీసుకొని పరారయ్యాడు.
నజీముద్దీన్‌ను ఆస్పత్రికి తరలించేసరికే అతను చనిపోయినట్టు ఆయనతోపాటు అక్కడే లెక్చరర్‌గా పనిచేస్తున్న జహీర్‌ఖాన్ అనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి రాత్రి 12.30 గంటలకు ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన భార్య కోమాలోకి వెళ్లిపోయింది.












Click it and Unblock the Notifications