NRI News: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు వ్యక్తి మృతి..
భారతీయ, అమెరికన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన బోస్టన్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. విశ్వచంద్ కొల్లా అనే తెలుగు ఎన్నారైని విమానాశ్రయంలో బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 47 ఏళ్ల విశ్వచంద్ కొల్లా తాకేడ ఫార్మాస్యూటికల్ కంపెనీలో డేటా అనలిస్ట్ గా పని చేస్తున్నాడు. మార్చి 28న అతను బోస్టన్‌లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు సంగీతకారుడిని పికప్ చేసుకోవడానికి వచ్చినట్లు యూఎస్ మీడియా తెలిపింది.
విశ్వచంద్ కొల్లా సాయంత్రం 5 గంటల సమయంలో స్నేహితుడిని పికప్ చేసుకోవడానికి టెర్మినల్ B వద్ద వేచి ఉన్నాడని మసాచుసెట్స్ స్టేట్ పోలీసులు తెలిపారు. అప్పుడే అతన్ని ఒక బస్సు ఢీకొట్టినట్లు తెలిపారు. విశ్వచంద్ కొల్లా తన కారు డ్రైవర్ వైపు నిలబడి ఉండగా అదే సమయంలో డార్ట్‌మౌత్ ట్రాన్స్‌పోర్టేషన్ మోటార్ కోచ్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టిందని ఆ రాష్ట్ర పోలీసు ప్రతినిధి డేవ్ ప్రోకోపియో ఒక ప్రకటనలో వివరించారు.

అతన్ని ఆస్పత్రికి తరలించాలని చూడగా.. ఘటన స్థలంలోనే అతను మృతి చెందినట్లు తెలిసింది. బస్సు డ్రైవర్ 54 ఏళ్ల మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. డార్ట్‌మౌత్ కోచ్.. లోగాన్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. విశ్వచంద్ కొల్లా కంపెనీ గ్లోబల్ ఆంకాలజీ విభాగంలో టకేడాలో పనిచేశారు. టకేడా ఇండస్ట్రీస్.. బోస్టన్.కామ్‌కి ఒక ప్రకటన విడుదల చేసింది. కొల్ల అనుహ్యా మరణం చాలా బాధకరమని పేర్కొంది. ఈ క్లిష్ట సమయంలో విశ్వచంద్ కుటుంబానికి, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేసింది. కాగా కొల్లా బంధువులు గో ఫండ్ మీ పేజీని ఏర్పాటు చేశారు. 406,151 డాలర్లను సేకరించారు. విశ్వచంద్ కొల్లాకు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications