కువైట్ టిడిపి అధ్యక్షుడు కుదరవల్లికి సన్మానం(పిక్చర్స్)
కువైట్ సిటీ: కువైట్, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగువారి కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్న ప్రవాసాంధ్రుడు, కువైట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావును గల్ఫ్-కువైట్ దేశాలకు చెందిన పలువురు తెలుగువారు ఆత్మీయ సన్మానం చేశారు. కువైట్‌లోని హపల్లిలో ఉన్న అవంతి ప్యాలస్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కుదరవల్లి మాట్లాడుతూ.. తనకు ఇంతటి గౌరవాన్ని అందించిన అందరికీ పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. మనకు దక్కినదాంట్లో ఇతరులకు సాయం చేయడం అన్నది స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నాన్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులోని సేవాగుణం కూడా తనకు సేవా మార్గం చూపించిందని తెలిపారు. ఆపన్నులను ఆదుకోవడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ లేదని అన్నారు. తనకు అన్నివేళలా సహకరిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి, వెన్ను దన్నుగా నిలుస్తున్న మిత్రులందరికీ కృతఙ్ఞతలు తెలియజేశారు కుదరవల్లి సుధాకరరావు.
ఈ కార్యక్రమంలో అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ తరపున కుదరవల్లిని జ్ఞాపిక, శాలువాతో సత్కరించగా.. అక్కలి నాగేంద్రబాబు, కొత్తపల్లి మోహన్ బాబు, కాపెర్ల పత్తభిరామ్ నాయుడు, దారురు సుభ్రమణ్యం, రవి, డిఫెన్సు, కువైట్ కాపు బలిజ సేవా దళం, ముదిలియార్, జీలకర్ర మురళి రాయల్స్ అండ్ టీం, బొమ్ము సి.ఎం., తెలంగాణా యువత, నారాయననాయుడు, ఈశ్వర్, మసిన, మద్దిన, యన్టీఆర్ 2 యన్టీఆర్ యువసేన కువైట్, కొండపల్లి నాగేశ్వరరావు, మారయ్య, బాబునాయుడు, కోటిబాబు, యన్టీఆర్ సేవాదళం కువైట్- కస్తూరి కోటేశ్వరనాయుడు, ఖైతాన్ బాబు, సురేష్ నాయుడు, మన కడప సేవా సమితి సభ్యులు, నాగినేని రమేష్ బాబు, సుబ్బు ఆర్‌విఎస్, పాతూరి ఫనిక్రిష్ణ లతో పాటు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం అభిమానులు, తెలుగువారు హాజరై కుదరవల్లి సుధాకరరావుకు అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి నాగేంద్ర బాబు అక్కిలి, మోహన్ బాబు కొతపల్లి మరియు పట్టాభినాయుడు కపెర్ల అధ్యక్షత వహించారు.

కుదరవల్లికి సన్మానం
కువైట్, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగువారి కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్న ప్రవాసాంధ్రుడు, కువైట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావును గల్ఫ్-కువైట్ దేశాలకు చెందిన పలువురు తెలుగువారు ఆత్మీయ సన్మానం చేశారు. కువైట్‌లోని హపల్లిలో ఉన్న అవంతి ప్యాలస్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

కుదరవల్లికి సన్మానం
ఈ సందర్భంగా కుదరవల్లి మాట్లాడుతూ.. తనకు ఇంతటి గౌరవాన్ని అందించిన అందరికీ పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.

కుదరవల్లికి సన్మానం
మనకు దక్కినదాంట్లో ఇతరులకు సాయం చేయడం అన్నది స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నాన్నట్లు తెలిపారు.

కుదరవల్లికి సన్మానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులోని సేవాగుణం కూడా తనకు సేవా మార్గం చూపించిందని తెలిపారు. ఆపన్నులను ఆదుకోవడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ లేదని అన్నారు.












Click it and Unblock the Notifications