చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణదేవరాయలుగా వడివేలు, వ్యతిరేకత?

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: జగజల భుజబల తెనాలి రామ అనే తమిళ చిత్రంలో వడివేలు ద్విపాత్రభినయం చేస్తున్నారు. తెనాలి రామకృష్ణగానూ ఆయనకు ఆశ్రయం ఇచ్చిన శ్రీకృష్ణదేవరాయలుగానూ ఆయన నటిస్తున్నారు గతంలో వడివేలు నటించిన 23వ పులకేశి చిత్రంలో రాజులను హేళన చేశారు, వారిని హాస్యధోరణిలో చూపించారు.

దాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీకృష్ణదేవరాయలును కూడా అదే విధంగా చూపించారని తమిళనాట కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దాంతో తమిళనాడులోని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నాయకత్వంలో తెలుగువాళ్లు చెన్నై ఫిలిం సెన్సార్ ఆఫీరస్ ఫకీర్ స్వామిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

Telugu Yuva Shakti opposes Vadivelu film

కృష్ణదేవరాయలు తెలుగు ప్రజల ఆరాధ్యుడని, అతను కవిపోషకుడిగా, ధార్మికకర్తగా ఎన్నో దేవాలయాలు నిర్మించాడని, కృష్ణదేవరాయలు నిర్మించిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే గొప్ప పేరు సంపాదించిన ధార్మిక సంస్థ అని వారు వినతిపత్రంలో చెప్పారు. ఈ స్థితిలో వడివేలు నటించిన జగజల భుజబల తెనాలి రామ చిత్రాన్ని కృష్ణదేవరాయలును కించపరిచే విధంగా నిర్మించి ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఒకవేళ హాస్యధోరణిలో, కించపరిచే విధంగా కృష్ణదేవరాయలు పాత్రను చిత్రీకరిస్తే తెలుగు ప్రజలంతా ఆందోళనకు దిగుతారని, చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్ల వద్ద ఆందోళనకు దిగుతారని వారు చెప్పారు. సెన్సార్ ఆఫీసర్‌ను కలిసిన తెలుగు నాయకుల్లో జి ఇజ్రాల్, ఎస్ సుందరం, కె రమణయ్య, పి. పెంచల్, కె. కమల్, ఎస్ నాగరాజు, ఎన్ బాబు తదితరులు ఉన్నారు.

English summary
Tamil Nadu Telugu Yuva Shakthi activist under the leadership of Kethireddy Jagadeeswar Redy met censor officer to represent Vadivelu film on Srikrishna Devarayalu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X