Amaravati: అమరావతిలో రైతులకు గుడ్ న్యూస్..! మే 1 నుంచి ఖాతాల్లో జమ...!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి (Amaravati) రాజధానిలో రైతులకు ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రెండో విడతలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ముందుగా ఇచ్చిన హామీ మేరకు కౌలు మొత్తాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మే1ను ముహుర్తంగా నిర్ణయించింది. ఈ మేరకు వారి ఖాతాల్లో మే1న నగదు జమ చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.
రాజధానిలో కొత్తగా జరుగుతున్న ల్యాండ్ పూలింగ్ లో భూములిస్తున్న రైతులకు మే ఒకటో తేదీ నుంచి కౌలు నగదు జమ చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలోని సీఆర్డీయే ఆఫీసులో ల్యాండ్ పూలింగ్ కొనసాగుతున్న తీరుపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ,ఇన్నర్ రింగ్ రోడ్,రైల్వే లైన్,రైల్వే స్టేషన్ కోసం 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కొనసాగుతుంది.

వీటిలో భూసమీకరణ ప్రక్రియ ను వేగవంతం చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. అలాగే ఎంజాయ్ మెంట్ సర్వే త్వరితగతిన చేయాలని అధికారులకు సూచించారు మంత్రి.ఆయా ప్రాజెక్టుల కోసం మొత్తం 7 గ్రామాల్లో 16667 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించేలా సీఆర్డీయే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 8 ల్యాండ్ పూలింగ్ యూనిట్లలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు 29 గ్రామాల్లో FSI పెంపుపైనా మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. FSI పెంపుపై టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నియమించిన కమిటీ అధ్యయనం చేస్తుందని, కమిటీ నివేదిక ఆధారంగా పెంపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications