Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి (Amaravati) పేరును ఇప్పటివరకూ ఇంగ్లీష్ లో రకరకాల స్పెల్లింగ్స్ తో రాయడం, పిలవడం జరుగుతోంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో అమరావతిని ఏపీ రాజధానిగా ఖరారు చేస్తూ రాష్ట్ర పునర్ విభజన చట్టంలో మార్పులు చేసింది. అలాగే అమరావతి పేరును కూడా ఖరారు చేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలోనూ ప్రభుత్వ వ్యవహారాల్లో ఎక్కడా తేడా లేకుండా ఒకే స్పెల్లింగ్ తో అమరావతి పేరు ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి పేరును ఇంగ్లీష్ లో ఇప్పటివరకూ Amaravati, Amaravathi ఇలా రెండు రకాలుగా రాసేవారు, పిలిచేవారు. దీన్ని ఇప్పుడు సరిచేస్తూ కేవలం Amaravati గా మాత్రమే వాడాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంతో పాటు హెచ్వోడీ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, ఇతర అన్ని కార్యాలయాల్లోనూ ఇకపై రాష్ట్ర రాజధాని పేరు Amaravatiగానే ఉండాలని పేరు చివర్లో Thi ఉండాలని వీల్లేదని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది.

Amaravati Only Govt Order Mandates AMARAVATI in All Official Communications Effective Immediately

ప్రభుత్వ శాఖలు ఇకపై అంతర్గతంగా జరుపుకునే సంభాషణలు, ఫైలింగ్స్, లేఖలు, ఇతర అంశాల్లోనూ అమరావతి కరెక్ట్ స్పెల్లింగ్ తో మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ప్రజలతో జరిపే సంభాషణలు, ఇతర వ్యవహారాలకూ ఇదే వర్తిస్తుందని తెలిపింది. దీంతో ఇకపై Amaravati పేరు రాజధానిగా ఖరారు కాబోతోంది. ఈ మేరకు అధికారిక పత్రాల్లోనూ మార్పులు చేర్పులు చేయబోతున్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపైనా ఇదే కనిపించబోతోంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+