అతని వల్లే ఈ సెంచరీ: వైభవ్ సూర్యవంశీ

యశస్వి జైస్వాల్ ఇచ్చిన సలహాతోనే సెంచరీ సాధించగలిగానని రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అన్నాడు. ఈ ఇన్నింగ్స్ కోసం ఎలాంటి ప్లాన్ చేయలేదని, స్వేచ్ఛగా ఆడుదామని మ్యాచ్‌కు ముందు యశస్వి జైస్వాల్ తనతో అన్నాడని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(37 బంతుల్లో 5 ఫోర్లు, 13 సిక్స్‌లతో 103) సెంచరీతో చెలరేగాడు.

తొలి ఇన్నింగ్స్ అనంతరం తన సెంచరీపై స్పందించిన వైభవ్ సూర్యవంశీ.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో తనదైన శైలిలో చెలరేగానని చెప్పాడు. మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థి జట్టు బౌలర్లను, బౌండరీల దూరాన్ని ఊహించుకుంటానని తెలిపాడు. 'తొలి బంతికే సిక్స్ కొట్టాలని ఎలాంటి ప్లాన్ చేయలేదు. మ్యాచ్‌కు ముందు నేను యశస్వి జైస్వాల్‌‌‌తో మాట్లాడాను. మనం స్వేచ్ఛగా ఆడుదామని యశ్ భయ్యా నాతో అన్నాడు. తొలి బంతి నుంచే మన సహజ సిద్దమైన ఆటను నమ్మకుందామని చెప్పాడు.

IPL 2026 Vaibhav Sooryavanshi Credits Yashasvi Jaiswal s Advice for Blazing 36-Ball Century Against SRH
Photo Credit: screen grab for jiohotstar

యశ్ భయ్యా మాటలతో ఈ రోజు నేను స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాను. పెద్దగా ఆలోచించలేదు. బంతి గమనాన్ని బట్టి ఆడాను. వికెట్ బాగుంది. అందుకే నా ఆటపై నాకు నమ్మకం కలిగింది. గత సీజన్‌లో ఇదే వేదికపై నేను ఆడిన తొలి మ్యాచ్ గుర్తుంది. జట్టుకు నా వంద శాతం శ్రమను అందించడం, నా శైలిలో చెలరేగడమే నా లక్ష్యం.

ప్రత్యర్థి బౌలర్లు ఎవరు.. వారి బౌలింగ్‌లో ఎలాంటి షాట్లు ఆడాలి? రెండు వైపులా బౌండరీల దూరం ఎంత ఉంటుంది అనే విషయాలను మ్యాచ్‌కు ముందు నేను ఊహించుకుంటాను. ఈ వికెట్ చాలా బాగుంది. బంతి బ్యాట్ మీదకు బాగా వస్తోంది. కొత్త బంతితో పేసర్లకు కొంత సహాయం అందుతోంది. మేం చేసిన స్కోర్ మంచిది. క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఈ స్కోర్‌ను కాపాడుకోవాలనుకుంటున్నాం. మా ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడమే మా ముందున్న లక్ష్యం.'అని యశస్వి జైస్వాల్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ(37 బంతుల్లో 5 ఫోర్లు, 13 సిక్స్‌లతో 103) విధ్వంసకర శతకానికి తోడుగా ధ్రువ్ జురెల్(35 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(2/38) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, సకీబ్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రఫుల్ హింగేలకు తలో వికెట్ తీసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+