Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లండన్‌లో దసరా, బతుకమ్మ వేడుకలు(పిక్చర్స్)

లండన్: హౌన్‌స్లా‌లోని లాంప్టొన్ స్కూల్ ఆడిటోరియంలో తెలంగాణ ఎన్నారై ఫోరం(టిఈఎన్ఎఫ్) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో యూకే నలుమూలల నుంచి సుమారు వెయ్యి మంది తెలంగాణ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రంగు రంగుల బతుకమ్మలతో తెలంగాణ ఆడపడుచులు సందడి చేశారు. విదేశాల్లోఉన్నపటికీ సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి ఆటపాటలతో బతుకమ్మ వేడుకలను కన్నులపండవగా నిర్వహించారు. చిన్నారులు సైతం సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.

అనంతరం బతుకమ్మలని నిమ్మజ్జనం చేసి, సాంప్రదాయ బద్దంగా సద్దుల ప్రసాదం ఇచ్చిపుచ్చుకున్నారు. స్వదేశం నుండి తెచ్చిన శమి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంవత్సరం కేవలం సంబరాలకే పరిమితం కాకుండా.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత, రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో ఇచ్చిన పిలుపు మేరకు ‘అడాప్ట్ ఏ ఫార్మర్' కార్యక్రమానికి మదత్తుగా ప్రత్యేక స్టాల్‌ని ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో రైతులకు భరోసా కల్పించడానికి ప్రభుత్వం, ఎంపి కవిత చేస్తున్న కార్యక్రమాలను హాజరైన అతిథులకు వివరించడం జరిగింది. తెలంగాణ బిడ్డలుగా, నాటి ఉద్యమం నుంచి నేటి పునర్నిర్మాణం వరకు అన్నింట్లో ముందున్న ఎన్నారై ఫోరమ్, రైతల సహాయార్ధం వేడుకల్లో సమకూరిన మొతాన్ని కవిత అందజేస్తునట్లు తెలిపారు.

బతుకమ్మ-దసరా వేడుకలు

బతుకమ్మ-దసరా వేడుకలు

హౌన్‌స్లా‌లోని లాంప్టొన్ స్కూల్ ఆడిటోరియంలో తెలంగాణ ఎన్నారై ఫోరం(టిఈఎన్ఎఫ్) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి.

బతుకమ్మ-దసరా వేడుకలు

బతుకమ్మ-దసరా వేడుకలు

ఈ వేడుకల్లో యూకే నలుమూలల నుంచి సుమారు వెయ్యి మంది తెలంగాణ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

బతుకమ్మ-దసరా వేడుకలు

బతుకమ్మ-దసరా వేడుకలు

ఈ సందర్భంగా రంగు రంగుల బతుకమ్మలతో తెలంగాణ ఆడపడుచులు సందడి చేశారు.

బతుకమ్మ-దసరా వేడుకలు

బతుకమ్మ-దసరా వేడుకలు


విదేశాల్లోఉన్నపటికీ సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి ఆటపాటలతో బతుకమ్మ వేడుకలను కన్నులపండవగా నిర్వహించారు. చిన్నారులు సైతం సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.

బతుకమ్మ-దసరా వేడుకలు

బతుకమ్మ-దసరా వేడుకలు



అనంతరం బతుకమ్మలని నిమ్మజ్జనం చేసి, సాంప్రదాయ బద్దంగా సద్దుల ప్రసాదం ఇచ్చిపుచ్చుకున్నారు.

హాజరైన ప్రవాసులు రైతుల పట్ల సంస్థ బాధ్యతను ప్రశంసించారు. భారత హై కమిషన్ ప్రతినిధి విజయ్ వసంతన్, బ్రిటన్‌లోని పలువురు ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రుత్ కాడ్బరీ, స్థానిక కౌన్సిలర్ ప్రీతం, ఇతర ప్రవాస భారత సంఘాల ప్రతినిధులు, వేడుకలో పాల్గొన్న వారిలో ఉన్నారు.

స్థానిక మహిళా ఎంపీలు ప్రవాస తెలంగాణా బిడ్డలతో కలిసి బతుకమ్మ, కోలాటం ఆడి సందడి చేశారు. తెలంగాణా ఎన్నారై ఫోరమ్ సంస్థ కొన్ని రోజుల ముందు నిర్వహించిన చారిటీ క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు ఆతిథులు బహుమతులు అందించారు.

ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. ప్రధమ బహుమతి-లయా రూపేష్ , ద్వితీయ-స్వప్న, తృతీయ-మీనాక్షి అంతటి అవార్డు గెలుచుకున్న వారిలో ఉన్నారు. రాఫెల్‌లో బంగారు బహుమతులు గెల్చుకున్నవారిలో ప్రధమ-రాజు , ద్వితీయ-అన్వేష్, తృతీయ- గోపి ఉన్నారు.

అధ్యక్షులు సిక్క చందు గౌడ్, ఉపాధ్యక్షులు పవిత్ర రెడ్డి కంది, ఇవెంట్స్ ఇంఛార్జ్ నగేష్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో టిఈఎన్ఎఫ్ వ్యవస్థాపక సభ్యులు, ఎన్నారై టిఆర్ఎస్ సెల్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, అడ్వైసరీ బోర్డ్ ఛైర్మన్ ఉదయ్ నాగరాజు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు సుధాకర్ గౌడ్, రత్నాకర్ కడుదుల, అడ్వైసరీ బోర్డ్ సభ్యులు ప్రమోద్ అంతటి, కోశాధికారి అశోక్ గౌడ్ దూసారి, వెంకట్ రెడ్డి, మహిళా విభాగం ఇంఛార్జ్ సుమా దేవి, సంక్షేమ శాఖ ఇంఛార్జ్ అర్చన జువ్వాడి, స్పోర్ట్స్ఇంఛార్జ్ నవీన్ రెడ్డి, నరేశ్ కుమార్, మీడీయ సెక్రెటరీ మల్లా రెడ్డి, కల్చరల్ కో-ఆర్డినేటర్ సుష్మణ రెడ్డి , స్వాతి, మీనాక్షి, నిర్మల, స్వప్న ఇవెంట్ కమిటీ సభ్యులు మంద సునీల్ రెడ్డి, శివాజీ షిండే, రేకుల విక్రమ్ రెడ్డి, రాజేష్ వర్మ, శ్రీకాంత్ జెల్ల, వంశీ చిట్టి, స్వామి ఆశ, సత్యం కంది, సునీల్,మహేష్ , రంగు వెంకట్, వాణి తదితరులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+