NRI News: ఆట ద్వైవార్షిక మహాసభలు ప్రారంభం..

అమెరికాలో అతి పెద్ద జాతీయ తెలుగు సంఘాల్లో ఒకటైన అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతి రెండు సంవత్సరాలకు నిర్వహించే ద్వైవార్షిక మహాసభలు అట్లాంటాలోని జార్జియా వరల్జ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో జూన్‌ 7న బాంక్వెట్‌ వేడుకలతో ఘనంగా మొదలయ్యాయి.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వ్యక్తులను ఆటా అవార్డులను ప్రదానం చేశారు. కమ్యూనిటీ సర్వీసెస్‌లో కృషి చేసినందుకుగాను టి. రామచంద్రారెడ్డికి అవార్డును దక్కింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని ఈ అవార్డును అందజేశారు. మెడిసిన్‌ రంగంలో చేసిన సేవకుగాను డాక్టర్‌ సతీష్‌కు బహుమతి పొందారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీరంగంలో డాక్టర్‌ మురళీధర్‌, లిటరేచర్‌లో అంబికా అనంత్‌కు, హ్యుమనిటేరియన్‌ సర్వీసెస్‌కుగాను పవన్‌ యర్రంశెట్టి, ఇన్నోవేటివ్‌ బిజినెస్‌ లీడర్‌షిప్‌కుగాను శిల్పిరెడ్డికి అవార్డులు వచ్చాయి.

The Biennial Conferences of Games in America have begun in earnest

యూత్‌ ఆచీవ్‌మెంట్‌కుగాను అనన్య విట్టల్‌కు, ఆర్ట్స్‌లో శ్వేత తిరుపురమల్లు, యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌లో చూపిన ప్రతిభకుగాను హేమచంద్ర రంభకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా దాతలను కూడా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌ బాబుతో పాటు సినీనటుడు శ్రీకాంత్‌, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. చివరన అనూప్‌ రూబెన్స్‌ సంగీత అందరిని అలరించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారికి ఆటా ప్రెసిడెంట్‌ మధు బొమ్మినేని, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జయంత్‌ చల్లా, కన్వీనర్‌ కిరణ్‌ పాశం ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+