NRI News: రెండో రోజు ఘనంగా సాగిన ఆట వేడుకలు..

ఆటా ద్వైవార్షిక 18వ మహాసభలు రెండో ఘనంగా జరిగాయి. నవత, యువత, భవిత థీమ్ తో మొదలైన వేడుకలు ఆకట్టుకున్నాయి. ఉదయాన్నే ఆటా నాయకులు ఊరేగింపుగా కన్వెన్షన్ ఇనాగరల్ వచ్చారు. ముఖ్య అతిథి హార్ట్ఫుల్నెస్ దాజి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని, కన్వెన్షన్ కన్వీనర్ కిరణ్ పాశం అందరికీ సాదర స్వాగతం పలికారు. స్థానిక అమెరికన్ రాజకీయ నాయకులను, ప్రభుత్వ ప్రతినిధులను, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాకు చెందిన వారిని శాలువా, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు.

కన్వెన్షన్ మెయిన్ స్టేజీపై క్లాసికల్, వెస్ట్రన్, సినిమా డాన్సులు, పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ విత్ దాజి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఝుమ్మంది నాదం ఫైనల్స్, సయ్యంది పాదం ఫైనల్స్, బ్యూటీ పాజెంట్ ఫైనల్స్, పొలిటికల్ ఫోరమ్, మహిళా ఫోరమ్, సాహితీ సదస్సు, బిజినెస్ ఫోరమ్, ఇమ్మిగ్రేషన్, టాక్సేషన్, పూర్వ విద్యార్థుల సమావేశాలు, వివాహ పరిచయ వేదిక వంటివి బ్రేకౌట్ రూమ్స్ లో నిర్వహించారు.

The game celebrations were held grandly on the second day

బ్యాక్ టు బ్యాక్ కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం మెయిన్ స్టేజీపై కల్చరల్ ప్రోగ్రామ్స్ తిరిగి ప్రారంభించారు. ప్రైమ్ టైం లో తెలంగాణ రాష్ట్ర సినిమా శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలుగు సినీ నటులు శ్రీకాంత్, ఆటా పాస్ట్ ప్రెసిడెంట్స్, ప్లాటినం స్పాన్సర్స్ తదితరులను ఆటా నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ముఖ్య అతిథి, ఇండియా నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన హార్ట్ఫుల్నెస్ దాజి ప్రసంగించారు.

జాతీయ అవార్డు గ్రహీత, సినీ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెషనల్ ఫ్యాషన్ షో అందరి అలరించింది. ఈ ఫ్యాషన్ షో లో స్థానిక యువతీయువకులతోపాటు టాలీవుడ్ తారలు మెహ్రీన్ , నేహా శెట్టి పాల్గొన్నారు. యాంకర్స్ శ్రీముఖి, రవళి తమ మాటలతో అందరినీ ఆకట్టుకున్నాయి.చివరిగా హైదరాబాద్ లో పాపులర్ మ్యూజికల్ బ్యాండ్ త్రీరీ బ్యాండ్ లైవ్ కాన్సర్ట్ లో ప్రతిభను ప్రదర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+