NRI News: అక్రమంగా అమెరికా వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది..
భారత్ నుంచి అమెరికా వెళ్లేవారి సంఖ్యం పెరుగుతోంది అమెరికాలో జీవించాలి. డాలర్లు సంపాదించాలి. ఎన్నారైలుగా మారాలని ఆలోచించే వారి సంఖ్య భారతదేశంలో పెరుగుతోంది. అక్రమంగా కూడా అమెరికాలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. చాలా మంది అమెరికాలోకి అక్రమంగా వస్తున్నారని అమెరికన్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ గణాంకాలు చెబుతున్నాయి. డాలర్లు కొందరిని ఎంతగా ఆకర్షిస్తున్నాయి అంటే ప్రాణాలను సైతం పణంగా పెట్టి అక్రమంగా అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ముఖ్యంగా గుజరాత్, పంజాబ్‌లలో యువత అక్రమంగా అమెరికాలోకి వెళ్తే ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బుల కోసం ఏజెంట్లు అమాయకపు యువకులను డాలర్ల ఆశ చూపి అమెరికాకు అక్రమంగా పంపే ప్రయత్నం చేస్తున్నారు. యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ నివేదిక ప్రకారం, 2018-19లో 8027 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారు. 2022-23లో ఈ సంఖ్య 12 రెట్లు పెరిగింది.

ఈ ఏడాది అమెరికా సరిహద్దుల్లో 96,917 మంది భారతీయులు పట్టుబడ్డారు. అంటే ఇప్పుడు ప్రతిరోజూ సగటున 250 మంది భారతీయులు అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది పంజాబ్, గుజరాత్‌లకు చెందిన వారు ఉన్నారు. విదేశాల్లో కూడా ఈ రెండు రాష్ట్రాల వారే ఎక్కువగా ఉంటున్నారు. అమెరికాకు అక్రమంగా వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంపై అమెరికా సెనేటర్ జేమ్స్ లాంక్‌ఫోర్డ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
ఇతర దేశాల నుంచి విమానాలు మార్చుకుని ముందుగా మెక్సికో, కెనడాకు వస్తారని, ఆ తర్వాత అక్కడి ఏజెంట్లు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తున్నారని తెలిపారు. దీన్ని అరికట్టడానికి కొన్ని చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు. డాంకీ రూట్ చేస్తున్నారు. డాంకీ రూట్ అంటే ఒక వ్యక్తి ఒక దేశం నుంచి మరొక దేశానికి మరియు తరువాత మూడవ దేశానికి వెళ్లడం ద్వారా మరొక దేశంలోకి అక్రమంగా ప్రవేశించడమని అర్థం.
భారత్ నుంచి వీసా తీసుకుని ఒక దేశానికి వెళ్లడం, వీసా లేకుండా అక్రమంగా మరో దేశానికి వెళ్లడం వంటివి దీని కిందికి వస్తుంటాయి. చాలా మంది అమెరికా లేదా కెనడాకు వెళ్లేందుకు డాంకీ రూట్ నే ఎంచుకుంటున్నారు.












Click it and Unblock the Notifications