NRI news: గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న భారతీయులు..!

గల్ఫ్ దేశాల్లో భారతీయుల సంఖ్య పెరుగుతోంది. యూఏఈ జనాభాలో 35 శాతం మంది భారతీయులు ఉన్నట్లు గణంకాలు చెబుతున్నాయి. దాదాపు కోటి మంది గల సుమార్ 35 లక్షల మంది భారతీయులు ఉన్నారు. భారత్ నుంచి ఎక్కువగా కేరళకు చెందిన వారు యూఏఈలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగానే గల్ఫ్ దేశాలకు వెళ్లారు. ముఖ్యంగా.. తెలంగాణ నుంచి ఎక్కువ దుబాయ్, సౌదీ, ఖాతార్, ఒమన్ వెళ్తుంటారు. అందులోను ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లా నుంచి భారీగా యూఏఈకి వెళ్తుంటారు.

2020లో ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన భారతీయులు భారత్ కు రూ. 6.8 లక్షల కోట్లు పంపించారు. అమెరికాలో స్థిరపడిన భారతీయుల నుంచి డబ్బు ఎక్కువగా రాగ.. ఆ తర్వాత గల్ఫ్ దేశాల నుంచి భారీగా డబ్బు ఇండియాకు పంపుతున్నారు. అత్యధిక సంఖ్యలో భారతీయులు, 3.4 మిలియన్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నివసిస్తుండగా.. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం NRIలలో దాదాపు 27శాతంతో సమానం.

The number of Indians going to Gulf countries is increasing

మరో 2.6 మిలియన్లు సౌదీ అరేబియాలో ఉండగా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్లలో మరో 2.9 మిలియన్ల భారతీయులు ఉన్నారు.ఈ నేపథ్యంలో భారత్ యూఏఈతో మంచి సంబంధాలు కొనసాగిస్తోంది. దౌత్యపరంగా యూఏఈ భారత్ మధ్య సత్సంబంధాలు ఉండడంతో యూఏఈకి వెలళ్లున్నవారు పెరుగుతున్నారు. మరోవైపు యూఏఈ నుంచి భారత్ కు పెట్టుబడులు కూడా పెరుగుతోన్నాయి.

ఇక విదేశీ జైళ్లలో 7925 మంది భారతీయులు ఖైదీలుగా మగ్గుతున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంది. ఇందులో అత్యధికంగా యూఏఈలో 1663 మంది ఉండగా.. ఆ తర్వాత సౌదీ అరేబియాలో 1363 మంది, నేపాల్‌లో 1039 మంది, ఖతర్‌లో 466 మంది, యూకేలో 373 మంది, అమెరికాలో 254 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నట్లు కథనం పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+