ఐర్లాండ్‌లో మరో భారతీయుడిపై దాడి.. జాత్యహంకారానికి ఫుల్ స్టాప్ లేదా ?

ఐర్లాండ్‌లో భారతీయులపై దాడులు పెరుగుతున్న ఘటనలు సర్వత్రా కలకలం రేపుతున్నాయి. రీసెంట్ గానే వాటర్‌ఫోర్డ్ నగరంలోని కిల్‌బర్రీ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయ కుటుంబానికి చెందిన 6 ఏళ్ల చిన్నారి నియా నవీన్‌పై తోటి పిల్లలు జాత్యహంకార దాడి చేశారు. బాలిక ప్రైవేట్‌ భాగాలను గాయపరిచి పరారయ్యారు. ఈ దాడి ఘటనను మరువక ముందే ఇప్పుడు డబ్లిన్‌లోని ఫెయిర్‌వ్యూ పార్క్‌లో మరో భారతీయుడిపై ముగ్గురు టీనేజర్లు దాడి చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడగా.. ఎనిమిది కుట్లు వేయాల్సి వచ్చిందని వైద్యులు వెల్లడించారు. తాను పార్క్ నుంచి ఇంటికి నడుస్తుండగా.. ఒక టీనేజర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వచ్చి తన కడుపులో తన్నాడని వాపోయాడు. దాంతో దూరంగా వెళ్లడానికి ప్రయత్నించగా, మరో ఇద్దరు కూడా వచ్చి కొట్టడం ప్రారంభించారని.. నేలపై పడిపోయిన తర్వాత కూడా దాడి కొనసాగించారని కన్నీటి పర్యంతం అయ్యారు. ఒక వ్యక్తి ఏకంగా మెటల్ వాటర్ బాటిల్‌తో కంటి మీద కొట్టాడని తెలిపాడు.

three-people-attack-on-indian-boy-at-ireland-due-to-racism

అయితే తనపై దాడి జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న కొంతమంది చూస్తూ ఉన్నారే తప్ప జోక్యం చేసుకోలేదని అన్నారు. అయితే ఇద్దరు టీనేజ్ యువకులు తనకు సహాయం చేసి పోలీసులకు సమాచారం అందించారని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.

మరోవైపు ఈ దాడిని ఐర్లాండ్ దేశాధ్యక్షుడు మైఖేల్ డి. హిగ్గిన్స్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులలో కొన్ని జాత్యహంకారంతో ముడిపడి ఉన్నాయని పేర్కొంటూ.. సదరు ఘటనను "నీచమైనవి" అని అభివర్ణించారు. భారతీయ సమాజం ఐర్లాండ్‌కు చేసిన సహకారాన్ని కొనియాడారు. ఈ దాడులు ఐరిష్ సమాజంలోని ఆతిథ్యం, స్నేహం ప్రాథమిక లక్షణాలను దెబ్బతీస్తున్నాయని వివరించారు.

అంతకు ముందు..

కిల్‌బర్రీ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయ కుటుంబానికి చెందిన 6 ఏళ్ల చిన్నారి నియా నవీన్‌పై తోటి పిల్లలు జాత్యహంకార దాడి చేశారు. నియా తన నివాసం బయట స్నేహితులతో ఆడుకుంటూ ఉంది. ఆ సమయంలో 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న వారు కొంతమంది అక్కడికి వచ్చారు. అదే సమయంలో నియా తల్లి.. మరో పాపకు చిన్నపిల్లకు పాలిచ్చేందుకు లోపలికి వెళ్లింది. అప్పుడు వారు నియా ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ.. సైకిల్‌తో ఆమె ప్రైవేట్ భాగాలను గాయపరిచారు. అంతే కాకుండా "డర్టీ ఇండియన్", "గో బ్యాక్ టు ఇండియా" అంటూ తీవ్ర జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపిస్తున్నారు. బాలిక కేకలు విని పరుగెత్తుకొచ్చిన తల్లి, దాడి చేసిన పిల్లలు అక్కడి నుంచి పారిపోతుండడం గమనించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+