NRI News: ఆస్ట్రేలియాలో సంక్రాంతి పండుగ.. పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్..
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడున్నా.. వారి సంప్రదాయాలను పాటిస్తారు. ఏ పండుగ అయినా ఘనంగా నిర్వహించుకుంటారు. తాజాగా
ఆస్ట్రేలియా లోని తెలుగు వారు ఘనంగా సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. మెల్బోర్న్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సంబురాల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, సలహా దారు జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఎల్లలు దాటి ఆస్ట్రేలియా కు వచ్చినా కూడా మన తెలుగు సాంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ అందరూ కలిసి సంబరాలు నిర్వహించుకోవడం చాలా అభినందనీయమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలుగు ప్రజలు ఆస్ట్రేలియాలో లక్ష మంది ఉండి ఎంతో కష్టపడి అభివృద్ధి కి సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు. మన సంప్రదాయాలను కాపాడుతూ ఇలా సంబరాలు చేసుకోవడం గొప్ప విషయంగా అభివర్ణించారు.

మన తెలుగు పల్లెల్లో పండుగ ఎలా నిర్వహిస్తామో అలానే ఇక్కడు కూడా పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ లో మన ప్రభుత్వం ఉందని.. ఇక్కడ ఉన్న తెలుగు పారిశ్రామిక వేత్తలు మీ ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టి అక్కడ అభివృద్ధికి సహకారాన్ని అందించాలని మహష్ కుమార్ గౌడ్ కోరారు. మీఅందరిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆకాంక్షించారు. సంస్కృతి సంప్రదాయాలు పరిమళించే అతి పెద్ద పండుగ సంక్రాంతి అని చెప్పారు. సంక్రాంతి ప్రకృతితో మమేకమైన రైతుల పండుగ అని వివరించారు. ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను చూసి రైతు మురిసిపోయే పండుగని పేర్కొన్నారు. ఈ సంక్రాంతి తో రైతుల కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పన చేస్తుందని గుర్తు చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications