టీఆర్ఎస్ పార్టీ అమెరికా శాఖ ప్రారంభం: అనిల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే. చంద్రశేఖరరావు పిలుపు మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తెలంగాణా ప్రజలే కాకుండా ఖండాంతరాల్లో నివసిస్తున్న తెలంగాణా బిడ్డలు సైతం బారీగా ఆన్‌లైన్ ద్వారా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారని అమెరికా టీఆర్ఎస్ అధ్యక్షులు అనిల్ కుర్మాచలం వెల్లడించారు.

దీంతో పాటు స్థానికంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రత్యేక శాఖలు ప్రారంభించాలని కోరుతూ ఎన్నో ఇ-మెయిల్స్ వచ్చాయని, వాటిని పార్టీ దృష్టికి తీసూకెళ్ళామని, ముందుగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అమెరికా శాఖ ప్రారంభం అవుతుందని, త్వరలో స్థానిక సభ్యులతో సంప్రదించి కమిటీ వివరాలు తెలియజేస్తామన్నారు.
ఈ సందర్భంగా ఎన్నారైలకు అవకాశం కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌కి, సభ్యత్వం తీసుకున్న ఎన్నారైలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications