కాలిఫోర్నియా, డల్లాస్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
కాలిఫోర్నియా: ఉత్తర అమెరికాలోని బేఏరియాలో తెలంగాణ రాష్ర్ట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు NRI TRS - USA అద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్ణ బైరి అద్యక్షత వహించారు. అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించి, జయ హే తెలంగాణా గేయంతో కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నాడు ఉద్యమంలో ఎన్నారైల పాత్ర మరువలేనిదని, నేడు బంగారు తెలంగాణ నిర్మాణానికి ఎన్నారైలు తమ విలువైన సూచనలు, సలహాలు అందిస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలతో ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ అభివృద్దికి పాటు పడుతున్నారని, బంగారు తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వ పనితీరుని ప్రజలందరూ అభినందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, ఆసరా, కళ్యాణి లక్ష్మి లాంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను NRI TRS - USA ద్వారా విస్త్రుత ప్రచారం కల్పించాలని అన్నారు.
కార్యక్రమానికి భాస్కర్ మద్ది, నవీన్ జలగం, శ్రీనివాస్ పొన్నాల, అభిలాష్ రంగినేని, కృష్ణ వేముల, రజనీకాంత్ కోసనం, ఉదయ కిరణ్ జొన్నల, నిహార్ దేవెల్ల, హరి గాక్కని హాజరయ్యారు.

కాలిఫోర్నియా, డల్లాస్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
ఉత్తర అమెరికాలోని బేఏరియాలో తెలంగాణ రాష్ర్ట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు NRI TRS - USA అద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్ణ బైరి అద్యక్షత వహించారు. అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించి, జయ హే తెలంగాణా గేయంతో కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

కాలిఫోర్నియా, డల్లాస్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
ఈ కార్యక్రమానికి తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నాడు ఉద్యమంలో ఎన్నారైల పాత్ర మరువలేనిదని, నేడు బంగారు తెలంగాణ నిర్మాణానికి ఎన్నారైలు తమ విలువైన సూచనలు, సలహాలు అందిస్తున్నారని అన్నారు.

కాలిఫోర్నియా, డల్లాస్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలతో ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ అభివృద్దికి పాటు పడుతున్నారని, బంగారు తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వ పనితీరుని ప్రజలందరూ అభినందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, ఆసరా, కళ్యాణి లక్ష్మి లాంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను NRI TRS - USA ద్వారా విస్త్రుత ప్రచారం కల్పించాలని అన్నారు.

కాలిఫోర్నియా, డల్లాస్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
ఉత్తర అమెరికాలోని డల్లాస్ నగరంలో తెలంగాణ రాష్ర్ట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు NRI TRS - USA అద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమ్మనికి రఘువీర్ అద్యక్షత వహించారు. అమరవీరులను
స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించి స్వర్గీయ జయశంకర్‌కు నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంబించారు.

కాలిఫోర్నియా, డల్లాస్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
ఎన్నారై తెరాస నాయకులు రఘువీర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణా లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి పతకాలు అభినందనీయమని మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ
పథకాలతో సాగు మరియు తాగు నీటి సమస్యలు శాశ్వతంగా తొలిగిపోతాయని అన్నారు.

కాలిఫోర్నియా, డల్లాస్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
సురభి శ్రీనివాస్ మాట్లాడుతూ కెసిఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలే కాకుండా తెలంగాణ ప్రజల కోసమని వాటర్ గ్రిడ్, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, స్వచ్చ హైదరాబాద్, మహిళల రక్షణకు షీ టీమ్స్, ఇంకుడు
గుంతలు లాంటి కార్యక్రమాల్ని చేపట్టారని అన్నారు.

కాలిఫోర్నియా, డల్లాస్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
రాష్ట్రంలో విద్యా వ్యాపారాన్ని అరికట్టి విద్యా ప్రమాణాలు, నాణ్యత పెంపొందించే దిశగా ప్రైవేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎన్నారైలు అభినందించారు. అనంతరం డల్లాస్ ప్రాంత ఎన్నారైలు కేక్ కట్ చేసి
ఆనందాన్ని పంచుకున్నారు.

కాలిఫోర్నియా, డల్లాస్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
ఈ కార్యక్రమానికి సుమారు 200 మందికి పైగా కార్యకర్తలు హాజరయ్యారు. కార్యక్రమానికి దేవేందర్ చిక్కాల, అజయ్ రెడ్డి, క్రాంతి కిరణ్, మనోహర్ మోటూరి, రఘు చిట్టిమల్ల, మహేందర్ ఘనపురం, కిరణ్ గొంతుక,
మోహన్ గోలి, శ్రీధర్ మాధవనేని, పవన్ రాజ్, శ్రీధర్ మాధవనేని, తదితరులు పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications