NRI News: సౌదీలో ఇద్దరు హైదరాబాదీ మహిళల మృతి..
సౌదీ అరేబియాలోని ఒక హైదరాబాదీ కుటుంబానికి రంజాన్ వేడుకలు విషాదంగా మారాయి. ఇద్దరు మహిళలు దమ్మామ్ నుంచి పవిత్ర నగరమైన మక్కాకు వెళ్తుండగా కారు ప్రమాదంలో మరణించారు. ఇద్దరు సోదరులు, వారి భార్యలతో కలిసి ఈద్ ప్రార్థనలు చేసేందుకు మక్కాకు వెళుతుండగా, రియాద్-మక్కా హైవేపై అఫీఫ్ సమీపంలో వారి కారును మరో కారు ఢీకొనడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. ఏప్రిల్ 8న ఈ ప్రమాదం జరిగింది.
మృతులను దమ్మాంలోని ఓ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఫర్హత్ అంజుమ్ హుస్సేనీ, ఆమె కోడలు రషీదా ఫరూఖీ అనే గృహిణిగా గుర్తించారు. వారి మృతదేహాలను అఫీఫ్‌లోని మార్చురీలో ఉంచారు. ఫర్హత్ అంజుమ్ షహబుద్దీన్ ఫారూఖీ భార్య, రషీదా ఫరూఖీ రఫీయుద్దీన్ ఫరూఖీ భార్య. అన్నదమ్ములిద్దరూ చాలా ఏళ్లుగా దమ్మామ్‌లో పనిచేస్తున్నారు. ఈద్ సెలవుల కారణంగా, అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయడంలో జాప్యం జరిగిందని, దీంతో అంత్యక్రియలు ఆలస్యమవుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

మృతదేహాలను హైదరాబాద్ తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మరో ఘటనలో భారతీయ విద్యార్థి కెనడాలో హత్యకు గురయ్యాడు. భారత విద్యార్థి తన ఆడి కారులోనే శవమై కనిపించాడు. అతనిపై కాల్పులు జరిపి చంపినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 12 రాత్రి 11 గంటల ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్దం వచ్చినట్లు స్థానికులు చెప్పారు.
మృతుడిని చిరాగ్ ఆంటిల్ గా గుర్తించారు. ఈ మధ్య విదేశాల్లో భారతీయ విద్యార్థుల హత్యలు పెరిగిపోతున్నాయి. చిరాగ్ మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు అతని కుటుంబం కౌండ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ గోఫండ్ ద్వారా డబ్బును సేకరిస్తున్నట్లు తెలిసింది. .
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications