రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్ధులు మృతి.. ఎక్కడంటే ?
అమెరికాలో ఉన్నత విద్య కోసం ఎన్నో ఆశయాలతో వెళ్లిన ఇద్దరు భారత యువకులు అకాల మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో వారు ప్రాణాలు కోల్పోవడం సర్వత్రా తీవ్ర విషాదం నింపుతోంది. అమెరికా కాలమానం ప్రకారం మే 10 (శనివారం) ఉదయం, పెన్సిల్వేనియా రాష్ట్రంలోని లాంకస్టర్ కౌంటీలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మృతులను సౌరవ్ ప్రభాకర్ (23), మానవ్ పటేల్ (20)గా గుర్తించారు. వీరిద్దరూ ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఘటన సమయంలో వారు మరో వ్యక్తితో కలిసి కారులో ప్రయాణిస్తున్నట్టు సమాచారం. సౌరవ్ వాహనాన్ని నడుపుతుండగా కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టిందని అంటున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న కారు ఒక వంతెన మధ్యలో ఇరుక్కుపోయిందని వెల్లడించారు.

ఈ ఘోర ప్రమాదంలో సౌరవ్, మానవ్ ఇద్దరూ అక్కడికక్కడే మరణించగా.. కారులో ఉన్న మూడో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనపై స్పందించిన న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు అన్నివిధాలా సహకరిస్తామని.. మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని భారత కాన్సులేట్ జనరల్ పేర్కొన్నారు. యువకుల మరణవార్తతో వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, యూనివర్సిటీ సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కొద్దిరోజుల క్రితమే ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని టేకులపల్లి వాసులుగా గుర్తించారు. ప్రగతి రెడ్డి, రోహిత్ రెడ్డి, ఇద్దరు పిల్లలు, సునీత కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రగతిరెడ్డి, పెద్దకుమారుడు అర్విన్, సునీత అక్కడికక్కడే మృతిచెందగా.. రోహిత్ రెడ్డి, చిన్నకుమారుడు గాయాలతో బయటపడ్డారు.
-
H1B Visa: 85 వేల మందికి లక్కీ ఛాన్స్, సెలెక్షన్ లిస్ట్ వచ్చేసింది! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..!












Click it and Unblock the Notifications