అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరు భారతీయులు మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వర్జీనియాలోని ఓ డిపార్టుమెంటల్ స్టోర్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు మృతి చెందడం తీవ్ర విషాదం నింపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
డిపార్ట్ మెంటల్ స్టోర్ లో భారత్ కు చెందిన ఊర్మి, ఆమె తండ్రి ప్రదీప్ పటేల్ పని చేస్తున్నారు. భార్య, కుమార్తెతో కలిసి ఆరేళ్ల క్రితం ప్రదీప్ పటేల్ గుజరాత్ నుంచి అమెరికా వెళ్లినట్లు సమాచారం. గురువారం ఉదయం మద్యం కొనేందుకు స్టోర్‌కు వెళ్లిన దుండగుడు ముందు రోజు రాత్రి స్టోర్‌ను ఎందుకు మూసివేశారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే కాల్పులు జరపగా ప్రదీప్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఊర్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కాల్పులకు తెగబడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications