ఎన్నారైల ఉగాది వేడుకలు (పిక్చర్స్)

డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్), స్థానిక యూలెస్ లోని ట్రినిటి హైస్కూల్లో షడ్రుచుల పండుగ వాతావరణం సంతరించుకుని ఉగాది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు విజయ్ మోహన్ కాకర్ల, ఈ కార్యక్రమ సమన్వయ కర్త మహేష్ ఆదిత్య ఆదిభట్ల ఆధ్వర్యంలో సాంస్కృతిక సమన్వయకర్త శారద సింగిరెడ్డి కార్యక్రమాలని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి , పూజిత కడ్మిసెట్టి, రశ్మిత కడ్మిసెట్టి, గౌతం పటేల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

స్థానిక విందు ఇండియన్ రెస్టారెంట్ వారు ఉగాది పచ్చడితో కూడిన, పసందైన పండుగ భోజనాలను , ఈ ఉగాది కి మొట్టమొదటి సారిగా టాంటెక్స్ వారు అరటి ఆకులో ఆహ్వానితులకు వడ్డించారు. ఈ ఉత్సవానికి విచ్చేసిన సుమారు 1000 మంది సమక్షంలో 250 మంది బాలబాలికలు, స్థానిక కళాకారులు ఉత్సాహంగా పాల్గొని వైవిధ్యమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. భారత దేశం నుండి ప్రత్యేకంగా విచ్చేసిన మిమిక్రీ కళాకారుడు "ఇమిటేషన్ రాజు, తన ప్రతిభావంతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.

టాంటెక్స్ కార్యదర్శి కృష్ణ రెడ్డి ఉప్పలపాటి ఉగాది శుభాకాంక్షలతో స్వాగతం పలికి ఆ తరువాయి , సాంస్కృతిక సమన్వయకర్త శారద సింగిరెడ్డి స్వాగతోపన్యాసంతో కార్యక్రమ శుభారంభం జరిగింది. శ్రీ జయనామ సంవత్సర విశేషాలను వివరిస్తూ మారింగంటి యుగంధరాచార్యులు పంచాంగ శ్రవణంతో కార్యక్రమాలు మొదలయ్యాయి. ముందుగా విజి సోమనాథ్ శిష్యుల ‘నారాయణ మంత్రం' కీర్తన, స్వప్న గుడిమెల్ల ఆధ్వర్యంలో ‘మువ్వల సవ్వడి', సౌమిత్రి తుపురాని పర్యవేక్షణలో ‘చిన్ని కృష్ణుడు' డాన్స్, సింధూర పోలసానిపల్లి ఆధ్వర్యంలో ‘లంబాడోళ్ళ పిల్ల' జానపద నృత్యం, హేమ చావాలి శిష్యుల ‘కూచిపూడి వైభవం' శాస్త్రీయ నృత్యం, రంజీత ఆర్య కొరియోగ్రఫీ చేసిన ‘ధమాక' టాలీవుడ్ మెడ్లీ శ్రోతలను ఆకట్టుకున్నాయి.

ఈ ఉగాది ఉత్సవాల సందర్భంగా మార్చి నెలలో నిర్వహించిన "వసంత గాన సౌరభం" సాహిత్య విలువలతో కూడిన సినీపాటల పోటీలను టాంటెక్స్ వారు ‘శ్రుతి, లయ, శ్రావ్యత, ఉచ్చారణ' అంశాల ప్రాతిపదికగా, స్థానిక బాల బాలికలకు వారి ప్రతిభా ప్రదర్శనకు అవకాశం కల్పిస్తూ, పోటీలను నిర్వహించారు. అందులో గెలిచిన భారతి కాల్డ్ వెల్, మహిత జంగేటి, నేహ ధర్మాపురం, ప్రజ్ఞ బ్రహ్మదేవర, కీర్తి చామకూర, ఈ ఉగాది ఉత్సవాల వేదికపై వారి పాటలను వినిపించి శ్రోతల మనస్సును దోచుకున్నారు. ఈ గెలుపొందిన విజేతలకు బహుమతుల పోషక దాత సతీష్ పున్నం ద్వారా అందుకున్నారు. డల్లాస్‌లో నివసిస్తున్నతెలుగు వారు సాంస్కృతిక కార్యక్రమ ప్రియులే కాక, అందులో ప్రతిభావంతులు కూడా ... ఇందుకు నిదర్శనంగా ‘డల్లాస్ గాయని గాయకుల సినీ విభావరి' మరియు రాజశేఖర్ సూరిభొట్ల దర్శకత్వం లో ‘స్వరాంజలి' ప్రత్యక్ష సంగీత కార్యక్రమాలు, విచ్చేసిన సంగీత ప్రియులను ఎంతో ఆకట్టుకున్నాయి.

అధ్యక్షుడు విజయ్ మోహన్ కాకర్ల శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ -తమ అధ్యక్ష సందేశంలో సంస్థ అభివృద్దికి తోడ్పాటు నందిస్తున్న పోషక దాతలకు, కార్యవర్గానికి, సభ్యులకు కృతఙ్ఞతలు తెలియ చేశారు. తన 2014 ముఖ్య సందేశాన్ని "కలుపుకుని పోవడం, కలిసి పని చేయడం, సంతోషంగా సాగటం' మరొకసారి ఆహ్వానితులకు గుర్తు చేస్తూ, అనుకుని విజయవంతంగా గత మూడు నెలలలో చేసిన కార్యక్రమాలలో గానసుధను 1220 AM తిరిగి ప్రసారం చేయటం, ఆరోగ్య అవగాహన సదస్సులు , క్రీడల పోటీలను గురించి, తరువాత చేయబోయే కార్యక్రమాల గురించి క్లుప్తంగా తెలుపుతూ, అందరి సహాయ సహకారాలు అందించమని విజ్ఞప్తి చేసారు.

ఉగాది ని పురస్కరించుకొని టాంటెక్స్ 2014 ఉగాది పురస్కారాలను ఈ సంవత్సరం సాహిత్యం, సాంకేతిక, శాస్త్ర, మహిళా సామాజిక సేవ, విద్యా రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు ప్రకటించారు. తెలుగు సాహిత్య రంగంలో ఆచార్య పూదూర్ జగదీశ్వరన్‌కు, శాస్త్ర రంగంలో డా. కృష్ణ బాపట్లకు, విద్యా రంగంలో ఆచార్య మతుకుమల్లి విద్యాసాగర్‌కు, సాంకేతిక రంగంలో డా.పులిగండ్ల విశ్వనాథానికి , మహిళా సామాజిక సేవా రంగంలో డా. భాను ఇవటూరికి ఈ పురస్కారాలను అందచేశారు.

టాంటెక్స్, తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ప్రసంగిస్తూ - జాతిపిత మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ తరపున మే ౩న శంకుస్థాపన, అక్టోబర్ నెలలో జరగబోయే మహాత్మాగాంధీ విగ్రహ స్థాపన కార్యక్రమ వివరాలు తెలుపుతూ, టాంటెక్స్ సభ్యులందరినీ ఆహ్వానించారు.

ఎంతో చక్కటి మిమిక్రీ ప్రదర్శనతో విచ్చేసిన వారందరినీ ఆనందపరిచిన ‘ఇమిటేషన్' రాజుని జ్ఞాపికతో సత్కరించారు. ఇలాంటి తెలుగు సంస్కృతి వెల్లివిరిచే కార్యక్రమాలను జరుపుకోవాలంటే, స్వచ్ఛంద కార్యకర్తలు ఎంతో అవసరం. ఇలాంటి కోవకు చెంది, అత్యుత్తమ స్వచ్ఛంద సేవలందిస్తున్నసతీష్ పున్నంకు "ఉత్తమ స్వచ్ఛంద సేవకుడు (బెస్ట్ వాలంటీర్) " పురస్కారాన్ని టాంటెక్స్ అధ్యక్షుడు విజయ మోహన్ కాకర్ల, ఈ ఉగాది ఉత్సవాల వేదికపై ఆహ్వానితుల కరతాళ ధ్వనుల మధ్య అందజేశారు. ఈ సందర్భంగా ఉగాది కార్యక్రమాలుకు తోడ్పడిన మహిళా బృందానికి తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.

ఇక సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు లోకి వెళ్ళితే, శాంతి నూతి నేతృత్వంలో ‘వర్షం' మెడ్లీ నృత్యం, జ్యోతి కందిమళ్ళ శిష్యులు చేసిన ‘అలరులు కురియగ' శాస్త్రీయ నృత్యం, సుధా దాసరి ఆధ్వర్యంలో ‘బార్బీ గర్ల్స్ డాషింగ్ బాయ్స్' మెడ్లీ డాన్సు, వసుధ రెడ్డి ఆధ్వర్యంలో ‘అడవి తల్లి' మెడ్లీ నృత్యం, రూప బంద నేతృత్వంలో ‘విశ్వరూపం' కథక్ నృత్యం, శ్రీలత సూరి శిష్య బృందం చేసిన "గాజులు" జానపద నృత్యం, శ్వేత వాసల్ వారి ‘టాలీవుడ్ బీట్స్' మెడ్లీ, కళ్యాణి ఆవుల నేతృత్వంలో ‘కుంతల వరాళి" థిల్లాన శాస్త్రీయ నృత్యం, మధు చిత్తజల్లు ఆధ్వర్యంలో ‘పల్లెపడుచులు' జానపద నృత్యం, చివరగా చక్రపాణి కుందేటి కోరియోగ్రఫీ చేసిన ‘తడాకా' మూవీ మెడ్లీ డాన్స్ తో ఈ ఉగాది ఉత్సవాల ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు శ్రోతలను ఆనందపరచి ఒక తీపి గుర్తుగా ముగిసాయి.వందన సమర్పణ గావిస్తూ కార్యక్రమ సమన్వయ కర్త మహేష్ ఆదిత్య ఆదిభట్ల వందనసమర్పణ చేశారు.

ఉగాది నృత్యం

ఉగాది నృత్యం

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం వేడుకలను ఎన్నారైలు డల్లాస్‌లో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఉగాది నృత్యం జరిగింది.

ఉగాది అలంకరణ

ఉగాది అలంకరణ

ఉగాది పర్వదినం వేడుకల సందర్భంగా తెలుగుదనం ఉట్టిపడే విధంగా ప్రాంగాణాన్ని వేదికను అలకించారు.

ఉగాది పచ్చడి ఇలా..

ఉగాది పచ్చడి ఇలా..

తెలుగు ఎన్నారైలు షడ్రుచల ఉగాది పచ్చడి సేవించారు. తెలుగుదనాన్ని తనివితీరా అనుభవించారు.

పంచాంగ శ్రవణం ఇలా...

పంచాంగ శ్రవణం ఇలా...

ఉగాది వేడుకల్లో ఎన్నారైలు పంచాంగ శ్రవణాన్ని కూడా ఆలకించారు. భవిష్యత్తు గురించి తెలిపే ఇది ఉగాది వేడుకల్లో ముఖ్యమైన భాగం.

ఉగాది పురస్కారాలు..

ఉగాది పురస్కారాలు..

వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు ఉగాది పర్వదినం సందర్భంగా పురస్కారాలను ప్రదానం చేశారు. వారు ఇలా..

గానసురభి విజేతలు..

గానసురభి విజేతలు..

ఉగాది పర్వదినం వేడుకల సందర్భంగా గాన సురభి విజేతలను ప్రకటించారు. వారికి బహుమతులు ప్రదానం చేశారు.

ఉగాది భోజనం..

ఉగాది భోజనం..

ఉగాది పర్వదినం సందర్భంగా ఎన్నారైలు ప్రత్యేకంగా చేసిన వంటకాలను రుచి చూశారు. వారు ఇలా భోజనాలు చేస్తూ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+