నెదర్లాండ్స్‌లో తానే ఉగాది వేడుకలు(ఫొటోలు)
నెదర్లాండ్స్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నెదర్లాండ్ ఆధ్వర్యంలో తెలుగు సంవత్సరాది ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందించే ఉద్దేశంతో వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక సేవలందించిన పలువురిని సత్కరించినట్లు తెలిపారు.

నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్‌ల సుమారు 400 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. తానే జర్నల్‌ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తెలుగు భాషను అభివృద్ధి పర్చడం కోసం మనబడి అనే కార్యక్రమాన్ని కూడా తానే ప్రారంభించింది.

వేడుకల సందర్భంగా నిర్వహించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి తానే అధ్యక్షుడు శివరాం తాడిగొట్ల కృతజ్ఞతలు తెలిపారు. శ్రీని ఇప్పిలి, ప్రసాద్ రామినేని, మూర్తి కర్రా, వివేక్ కరియావుల తదితులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.













Click it and Unblock the Notifications