యుకె: భార్య, కూతుళ్లను చంపి, ఎన్నారై ఆత్మహత్య

UK: Indian origin man kills wife, two daughters, commits suicide
లండన్: ఇంగ్లాండ్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కూతుళ్లను హత్య చేసి, ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

జతీంద్ర లాడ్(49)చ అతని భార్య దుక్షా లాడ్(44), వారి ఇద్దరు కుమార్తెలు త్రిష(19), నిషా(17)లు సోమవారం రాత్రి తమ ఇంట్లో శవాలుగా పడి వున్నారని పోలీసులు తెలిపారు. ఇరుగుపొరుగు వారిచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్నామని పోలీసులు చెప్పారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న యార్క్‌షైర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్యకు ఎవరు కారణమనేదానిపై విచారణ జరపడం లేదని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

జతీంద్ర ఈ దారుణానికి పాల్పడటానికి గల కారణాలు అన్వేషించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ కేసుకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేవని చెప్పారు. ఇరుగుపొరుగువారిని కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.

ఘటనపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్పీ స్థానికులకు చెప్పారు. గత 20ఏళ్లుగా బాధిత కుటుంబం ఇక్కడే నివాసముంటోందని చెప్పారు. ఆ కుటుంబసభ్యులు తమతో చాలా బాగుండేవారని ఇరుగుపొరుగువారు చెప్పారని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+