కువైట్‌లో ఘనంగా వినాయక చవితి (ఫోటోలు)
కువైట్ లో ఉన్న తెలుగు వారందరూ ఒక్కటై ‘గణేష్ ఉత్సవ కమిటీ'గా ఏర్పడి, అత్యంత ఏకాగ్రతతో, అనన్య భక్తి తో కువైట్‌లో గణేష్ ఉత్సవాలను నిర్వహించారు. గణేష్ ఉత్సవ కమిటీ - కువైట్ వారు అన్నీ అసోసియేషన్స్ సాకారంతో
కువైట్ లో ఉన్న తెలుగు వారందరూ ఒక్కటై 'గణేష్ ఉత్సవ కమిటీ'గా ఏర్పడి, అత్యంత ఏకాగ్రతతో, అనన్య భక్తి తో కువైట్‌లో గణేష్ ఉత్సవాలను నిర్వహించారు. గణేష్ ఉత్సవ కమిటీ - కువైట్ వారు అన్నీ అసోసియేషన్స్ సాకారంతో నిర్వహించిన గల్ఫ్ గణేష్ ఉత్సవాలు అంబరాన్నంటే సంబరాలతో, అంగరంగ వైభవంగా, అత్యంత రమణీయంగా జరిగాయి.
గణనాధుని ముగ్ధ మోహన రూపంతో, భక్తుల ఆనందోత్సాహాల నడుమ కన్నుల పండుగగా జరిగింది. ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ - ఖైతాన్ వేదికగా జరిగిన ఈ గణేష్ ఉత్సవాలలో చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతీ ఒక్కరు పాల్గొని, లంబోదరుని ప్రీతితో సేవించుకుని తరించారు. వినాయకుని పూజతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు, గణ నాధుని పూజను భక్తిశ్రద్దలతో నిర్వహించారు.

కువైట్‌లో ఘనంగా వినాయక చవితి (ఫోటోలు)
ఈ కార్యక్రమం ఉదయం 9:30 కు మొదలై నిర్విరామంగా రాత్రి 9:30 కి నిమజ్జనం కార్యక్రమంతో ముగిసాయి. శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో నిర్వహించిన వినాయకుని పూజను తిలకించడానికి భక్తులు పోటీ పడ్డారు. దాదాపు 3000 మంది పైచిలుకు భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి, ఆ గజ ముఖుని దర్శించుకుని, స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులయ్యారు.

కువైట్‌లో ఘనంగా వినాయక చవితి (ఫోటోలు)
ప్రాంగణంలో భక్తుల తాకిడితో ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ఆవరణ నిండిపోయింది. గణేశుని ప్రసాదంను వేణు, నారాయణమ్మ దంపతులు ప్రత్యేకంగా తయారు చేయించారు. అత్యంత పవిత్రమైన ఈ స్వామి వారి లడ్డుని వేలంపాట నిర్వహించారు. ఆద్యంతం ఉత్కంటగా జరిగిన ఈ వేలంపాటలో ప్రమీల, నారాయణ దంపతులు 1116 KD లకు (ఇండియన్ రూపాయలలో 2,45,520/-) స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు.

కువైట్‌లో ఘనంగా వినాయక చవితి (ఫోటోలు)
తదుపరి ఈ ప్రసాదాన్ని భక్తులందరికీ స్వయంగా పంచారు. లడ్డు తో పాటుగా స్వామి వారి పట్టు వస్త్రాలకు కూడా వేలంపాట నిర్వహించారు. ఈ పట్టు వస్త్రాలను, శ్రీ కృష్ణ దేవరాయ కాపు, బలిజ సంఘం వారు గణేశునికి సమర్పించుకున్నారు, దీనితో పాటుగా గల్ఫ్గణేష్ ఉత్సవాలలో భక్తుల సేవలను అందుకున్న వినాయకుని విగ్రహాన్ని సమర్పించినదికూడావీరేనని ఈ సంఘ అధ్యక్షుడుజిలకర మురళీ గారు తెలియజేశారు.

కువైట్‌లో ఘనంగా వినాయక చవితి (ఫోటోలు)
ఈ వేలంపాటలో జ్యోతినేని జయరాం గారు 150 KD (Rs.33,000/-) లకు గణేశుని పట్టు వస్త్రాలను కైవసం చేసుకున్నారు. కువైట్ లో శుచి మరియు రుచికరమైన, సాంప్రదాయ తెలుగు వంటకాలను తయారు చేసే ఆంధ్రా స్పైస్ కేటరింగ్ సర్వీస్ వారిచే తయారుచేయబడిన ఘుమఘుమలాడే, పసందైన విందు భోజనాన్ని వడ్డించారు.

కువైట్‌లో ఘనంగా వినాయక చవితి (ఫోటోలు)
సుమారుగా 1500 మంది భక్తులు గణ నాయకుని స్మరియించుకుంటూ కడు భక్తితో అన్న ప్రసాదాలను స్వీకరించినట్లు గణేష్ ఉత్సవ కమిటీ ఆర్గనైజర్ రామ్ కొత్తపల్లి (మోహన్ బాబు) గారు తెలియజేశారు. అన్నప్రసాదాల అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ కృష్ణ చైతన్య చెక్క భజన సంఘం శ్రీ చంద్ర శేఖర్ గారి ఆధ్వర్యంలో గంటన్నర పాటు గణ నాధుని చెక్క భజనతో భక్తులను మైమరపింపజేశారు.

కువైట్‌లో ఘనంగా వినాయక చవితి (ఫోటోలు)
ఆ తర్వాత ఫ్యూజన్ డాన్స్ అకాడమీ వారి ఆటపాటలతో, మలయాళం, తమిళ్ మరియు ఉత్తర భారతీయ సంఘాలు, వారి వారి సంప్రదాయ నృత్య రీతులను ప్రదర్శించి, వీక్షకులకు కనువిందు చేశారు. అలాగే మన సంప్రదాయ నృత్య రీతులైన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలను శ్రీమతి వేదవల్లి గారి శిష్యులు ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలను పొందారు.












Click it and Unblock the Notifications