యుఎస్‌లో బతుకమ్మ వేడుక: మధుప్రియ పాట(ఫొటో)

న్యూయార్క్: బతుకమ్మ వేడుకలను తెలంగాణ ప్రవాసులు అమెరికాలోని వర్జీనియాలో ఇటీవల ఘనంగా జరుపుకున్నారు. విజన్ తెలంగాణ అసోసియేషన్(విటిఏ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న జరిగిన ఈ వేడుకల్లో భారీ ఎత్తున మహిళలు పాల్గొని, బతుకమ్మ ఆటపాటలతో ఆకట్టుకున్నారు. సుమారు 1,200మంది ప్రవాసులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

స్థానిక సామాజిక కార్యకర్త వసుధర, మహిళా వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయంతం చేశారు. గాయని మధుప్రియ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరై పలు పాటలను పాడి సందడి చేశారు. మహిశాసుర మర్ధిని నృత్యం చేసిన ఇంద్రాణి దవలూరి అహుతులను అమితంగా ఆకట్టుకున్నారు. వేడుకల సందర్భంగా తయారు చేసిన ప్రత్యేకమైన ఆహార పదార్థాలను మహిళలు ఇచ్చిపుచ్చుకున్నారు.

అందమైన రంగు రంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి, కోలాటం, సాంప్రదాయ నృత్యాలతో మహిళలు, యువతులు సందడి చేశారు. ఈ వేడుకల్లో పలువురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలు కూడా పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొని విజయం చేసిన ప్రతి ఒక్కరికి అశోక్ వాసం, హరి కంచర్ల, పవన్ కొండపల్లి విటిఏ తరపున కృతజ్ఞతలు తెలిపారు. స్పాన్సర్‌గా వ్యవహరించిన భాను బి, శ్రీధర్ మారం, రాజ్ బొప్పూరిలకు ప్రత్యక కృతజ్ఞతలు తెలిపారు.

VTA Bathukamma Celebrations in Washington DC

విటిఏ బోర్డ్ సభ్యులు జగదీష్ బొందుగుల, విజయ్ చాట్ల, రమణ కంచేట్టి, పవన్ గిర్ల, శ్రీనివాస్ విప్ప, శ్రీధర్ రెడ్డి మొగుళ్ల, అరుణ్ గన్నమనేని, శ్రీధర్ సమ్మిది, సంతోష్ వేముల, వేణు నక్షత్రమ్, హరి తాటికొండ, ప్రవీణ్ దొడ్డా, శ్రీధర్ మారం, సన్మయి రెడ్డి, ప్రదీప్ నుగురి, రాంరెడ్డి జక్కా, కార్తిక్ రెడ్డి, నాగర్జున రెడ్డి ఎం, సుధీర్ ఆర్ దమిడి, వెంకట్ బుర్రి, సంతోష్ వినుకొండ, శ్రీధర్ బండి, కళ్యాణ్ ముద్దసాని, సుధీర్ కోడం, మధు బెల్లం, రామ్ ఎర్రబెల్లి, గోపాల్ రెడ్డి, ప్రవీణ్ నూకల, ప్రవీణ్ శ్యామల, ఇతర వాలంటీర్లు పాల్గొని విజయం చేశారు.

స్థానిక నాయకులు రామ్ కొండా, రవి పులి, సుధారాణి, నర్సింహ కొప్పుల, లోకేష్ అనంతుల, శ్రీధర్ బానాల, రాజిరెడ్డి, భువనేశ్ భుజలకు విజన్ తెలంగాణ అసోసియేషన్(డిసి చాప్టర్) ఛైర్మన్ హరి కంచర్ల, అద్యక్షుడు అశోక్ వాసంలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+