వాషింగ్టన్‌లో సంక్రాంతి సంబరాలు

వాషింగ్టన్: అమెరికాలోని తెలుగు ప్రజలు సంక్రాంతి సంబరాలను వాషింగ్టన్ తెలుగు సమితి (వాట్స్) ఆధ్వర్యంలో వాషింగ్టన్‌లో ఘనంగా జరుపుకున్నారు. వాట్స్ అధ్యక్షుడు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన ఈ వేడుకలకు 600 మంది ప్రవాసులు సాంప్రదాయ వస్త్రధారణలో హాజరయ్యారు. దీంతో వారందరూ భారతదేశంలోనే ఉన్నారన్న వాతావరణం అక్కడ నెలకొంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. పలువురు ఔత్సాహికులు పాటలు పాడి అలరించగా.. మరికొందరు సాంప్రదాయ నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. వయస్సు భేదం లేకుండా అందరూ ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Washigton Telugu Samithi ‘sSankranthi Sambaralu 2014

ఈ సందర్భంగా వాట్స్ అధ్యక్షుడు మాట్లాడారు. తెలుగువారి అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. ఇటిప్పటికే తెలుగు బడి అనే కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

‘సంకీర్తనం' పేరుతో సాంప్రదాయ సంగీత, నృత్య పాఠశాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలుగు వారి అభివృద్ధి కోసం ‘చేయూత' అనే ఫోరంను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ‘సేవ' పేరిట వైద్య సహాయం, ఇమ్మిగ్రేషన్ అత్యవసర సేవలు అందించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అనిల్ రెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+