అమెరికాలో మహిళా దినోత్సవాలు

ఈ ఏడాది అమెరికాలోని 8 నగరాల్లో మహిళా దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మహిళలు సాధించిన విజయాలు, వారి అభిప్రాయల వెల్లడించేందుకు పలు కార్యక్రమాలు, కార్పొరేట్ రంగం, సామాజిక సంస్థలు నిర్వహించడం, సోషల్ మీడియా, అమెరికాలో గృహ హింస లాంటి అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆటా సభ్యులు తెలిపారు.
అమెరికాలో నివాసం ఉంటున్న భారత మహిళలను అభినందించేందుకు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలు, వారి అభిప్రాయాలు, సమాజాభివృద్ధికి వారు వివిధ సూచనలు ఇవ్వవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ మహిళా దినోత్సవ వేడుకలకు ప్రవేశం ఉచితమని, అందరూ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆటా సభ్యులు కోరారు.
మార్చి 2న డల్లాస్‌లో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. మార్చి 8న వాషింగ్టన్ డిసి, అట్లాంటా జిఏ, మిన్నియాపోలిస్ ఎంఎన్, హూస్టన్ టిఎక్స్‌లలో, మార్చి 14న ఫిలడెల్ఫియాలో, మార్చి 15న చికాగోలో, మార్చి 30న ఆస్టిన్‌లో వేడుకలను నిర్వహించనున్నట్లు ఆటా మీడియా ప్రతినిధి హరిప్రసాద్ రెడ్డి లింగాల తెలిపారు.












Click it and Unblock the Notifications