అంజనాద్రి ఆలయ బంగారు ఆభరణాలపై తప్పుడు ప్రచారం చేయొద్దు: AMR ఇండియా
హైదరాబాద్, మే 2026: ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ బి. సుబ్బరామిరెడ్డి తెలిపారు - హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త ఎ. మహేష్ రెడ్డి కర్నాటక రాష్ట్రం కొప్పళ జిల్లా గంగావతి ప్రాంతంలోని అంజనాద్రి హనుమాన్ దేవస్థానానికి విరాళంగా అందించిన ఆభరణాలలో 1 కిలో 280 గ్రాముల బంగారం వినియోగించబడిందని, వాటి విలువ దాదాపు ₹2.20 కోట్లుగా ఉందని.
కేవలం 250-300 గ్రాముల బంగారం మాత్రమే వినియోగించారని వస్తున్న వార్తలు అసత్యమని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన బిల్లులు, ఆధార పత్రాలు ఆలయ అధికారులకు ఇప్పటికే సమర్పించబడ్డాయి.
ముఖ్యాంశాలు
• అంజనాద్రి హనుమాన్ దేవస్థానానికి విరాళంగా ఇచ్చిన ఆభరణాలలో 1 కిలో 280 గ్రాముల బంగారం వినియోగం
• 300 గ్రాములే వినియోగించారన్న ప్రచారం అసత్యం; ఆభరణాల విలువ ₹2.20 కోట్లుగా నిర్ధారణ
• తయారీదారులు, దాత - AMR India Ltd - ఆలయ అధికారులకు బిల్లులు, పత్రాలు సమర్పించారు
• మీడియా, సోషల్ మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి
• ప్రకటన విడుదల చేసినవారు: బి. సుబ్బరామిరెడ్డి, డైరెక్టర్, AMR India Ltd

అధికారిక ప్రకటన వివరాలు
"2026 మే 8న ఏఎంఆర్ సంస్థ చైర్మన్ శ్రీ ఎ. మహేష్ కుమార్ రెడ్డి అంజనాద్రి దేవస్థానానికి కిరీటం, మకరతోరణం, గద, ఛత్రి, సూర్య చంద్ర, గరుడ హనుమ జెండా వంటి మొత్తం 12 బంగారు ఆభరణాలు విరాళంగా అందించారు. వీటికి 1280 గ్రాముల బంగారం వినియోగించబడింది. వీటి విలువ దాదాపు ₹2.20 కోట్లుగా ఉంటుంది.అయితే అవగాహన లోపం, తప్పుదారి పట్టించే ప్రచారం కారణంగా కేవలం 300 గ్రాములే వినియోగించారన్న అసత్య సమాచారం వ్యాప్తి చెందింది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, షిర్డీ సాయి బాబా వంటి దేశవ్యాప్తంగా ప్రసిద్ధ దేవాలయాలకు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు విరాళంగా ఇచ్చిన దాతలపై ఇలాంటి అసత్య ప్రచారం జరగడం బాధాకరం.
ఆభరణాలను కర్నూలు జిల్లా ఆదోనిలోని కె. రంగనాచారి సన్స్ మెటల్ వర్క్స్ సంస్థ తయారు చేసింది. సంబంధిత బిల్లులు ఆలయ అధికారులకు సమర్పించబడ్డాయి. కావున భక్తులు, ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దు.Tibarumal Jewellery, Hyderabad సంస్థ ఇన్వాయిస్ ఆధారంగా ఆభరణాల విలువ ₹2,20,42,000/- గా నిర్ధారించబడింది. దేవునికి భక్తితో సమర్పించిన పవిత్ర ఆభరణాల విషయమై ప్రజలు వాస్తవాలను గమనించాలి."
తయారీ సంస్థ జ్యుడీషియల్ బాండ్ వివరాలు
"బంగారు ఆభరణాలు తయారు చేయడానికి ఏఎంఆర్ చైర్మన్ మహేష్ రెడ్డి మాకు 1400 గ్రాముల (1.4 కిలోలు) బంగారం అందజేశారు. దీని ద్వారా 12 రకాల ఆభరణాలను తయారు చేశాము. తరుగుపోయిన తర్వాత నికర బరువు 1 కిలో 280 గ్రాములు వచ్చింది. ఈ బంగారు ఆభరణాలకు 50 సంవత్సరాల గ్యారంటీ ఇస్తున్నాము."
విజ్ఞప్తి
మీడియా సంస్థలు ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ప్రచురించాలని విజ్ఞప్తి చేశారు.హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేయవద్దని కోరారు. కుట్రపూర్వకంగా అసత్యాలు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రకటన విడుదల చేసినవారు:
బి. సుబ్బరామిరెడ్డి
డైరెక్టర్, AMR India Limited, హైదరాబాద్












Click it and Unblock the Notifications