అపర్ణ కన్స్‌ట్రక్షన్స్ నుంచి అపర్ణ న్యూలాండ్స్:హైదరాబాద్‌లో భారీ పెట్టుబడితో హైరైజ్ టవర్స్..!
హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోనే అత్యంత నమ్మదగిన విశ్వసనీయత చూరగొన్న రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ ఏదైనా ఉందంటే అది అపర్ణ కన్స్‌ట్రక్షన్స్ మరియు ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే చెప్పాలి.తాజాగా హైదరాబాద్‌లో ఈ సంస్థ రెండు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అపర్ణ న్యూలాండ్స్, అపర్ణ సరోవర్ టవర్స్ పేరుతో రూ.2425 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టులను ప్రారంభిస్తోంది.
తెల్లాపూర్, నల్లగండ్ల ప్రాంతాల్లో 2500 అపార్ట్‌మెంట్స్‌ను నిర్మించనుంది. ఈ అపార్ట్‌మెంట్‌లు 1475 చదరపు అడుగు నుంచి 3700 చదరపు అడుగుల వరకు అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతంలో నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేయాలన్న తపనతో అపర్ణ కన్స్‌ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పనిచేస్తోంది.
భవిష్యత్తులో అపర్ణ కన్స్‌ట్రక్షన్స్ నుంచి రాబోయే ప్రాజెక్టుల గురించి ఆ సంస్థ డైరెక్టర్ రాకేష్ రెడ్డి మాట్లాడారు." భారత్‌లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఇటు రెసిడెన్షియల్ అటు కమర్షియల్ పరంగా స్థిరమైన వృద్ధి నమోదవుతూ వస్తోంది.
రియల్ ఎస్టేట్ రంగంకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో తమ సంస్థ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీల నుంచి కమర్షియల్ రీటైల్ సెగ్మెంట్ వరకు ఈ ఏడాది విస్తరించాలనే నిర్ణయానికి వచ్చాం. రియల్ ఎస్టేట్ రంగంలో అపర్ణ కన్స్‌ట్రక్షన్స్ తనదైన ముద్ర వేసుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది.2024లో అదనంగా ఐదు భారీ ప్రాజెక్టులు.. ప్రాథమికంగా గేటెడ్ కమ్యూనిటీలు, ప్లాట్స్ పై దృష్టి సారిస్తున్నాం. ప్రీమియం/అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లే లక్ష్యంగా రాబోతున్నాయి. ఆమేరకు ప్రణాళిక సిద్ధం చేశాం " అని డైరెక్టర్ రాకేష్ రెడ్డి వివరించారు.
తెల్లాపూర్‌లో దాదాపుగా 14 ఎకరాల్లో విస్తరించిన అపర్ణ న్యూలాండ్స్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉంది. ఇందులో ఎనిమిది హైరైజ్ టవర్స్ నిర్మాణం జరుగుతుంది. ఒక్కో టవర్‌లో 42 ఫ్లోర్లతో మొత్తంగా 1976 ఫ్లాట్స్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.ఇక 2.5 BHK, 3 BHK అపార్ట్‌మెంట్స్ ఇందులో ఉంటాయి. 1475 చదరపు అడుగులతో 2.5 BHK ఉండగా 1991 చదరపు అడుగులతో 3 BHK అందుబాటులోకి వస్తాయి.
ఈ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్న వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తోంది అపర్ణ కన్స్‌ట్రక్షన్స్. ఇక కూత వేటు దూరంలో ఐటీ కారిడార్, ప్రముఖ విద్యా సంస్థలు,హాస్పిటల్స్, కాలేజీలు ఉన్నాయి. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం నుంచి వీటన్నిటినీ చేరుకునేందుకు కేవలం అరగంట సమయం మాత్రమే పడుతుంది. ఇక ఈ ప్రాజెక్టులో 80శాతం ఏరియా ఓపెన్ స్పేస్ ఉంటుంది. రెసిడెంట్స్‌కు మంచి అనుభూతి కల్పించేందుకు ఇలా ప్లాన్ చేసింది సంస్థ.ఈ బహిరంగ ప్రదేశంలో వివిధ రకాల గార్డెన్స్, రిలాక్స్ అయ్యేందుకు క్లబ్ హౌజ్, వాతావరణ నియంత్రణ కలిగిఉన్న స్విమ్మింగ్ పూల్‌తో పాటు ఇతర ఎమినిటీస్ కూడా ఉన్నాయి. RERA రిజిస్ట్రేషన్ నెంబర్:PO1100007480
తెల్లాపూర్‌లోని అపర్ణ న్యూలాండ్స్ నుంచి రెండు ఎంట్రెన్స్‌లున్నాయి. ఉస్మాన్ నగర్/ ఔటర్ రింగ్ రోడ్ (వెస్ట్) కనెక్ట్ చేస్తూ 100 ఫీట్ రోడ్, గోపనపల్లిని కనెక్ట్ చేస్తూ తూర్పు దిక్కుకు 60 ఫీట్ రోడ్ ఉన్నాయి.
ఇక 10 నిమిషాల నుంచి 25 నిమిషాలలోగా చేరుకునేలా అక్ష హాస్పిటల్, సిటిజెన్ హాస్పిటల్, స్టార్ హాస్పిటల్స్, కాంటినెంటల్ హాస్పిటల్స్, సిటిజెన్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. రెండు నిమిషాల నుంచి 15 నిమిషాలలోపు చేరుకునేలా యూరోకిడ్స్ ప్రీ స్కూల్, బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్, సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్, గ్రీన్ గాబల్స్ ఇంటర్నేషనల్ స్కూల్, విస్తా ఇంటర్నేషనల్ స్కూల్, గ్లెండేల్ కేంబ్రిడ్జ్ స్కూల్ ఉన్నాయి.సెయింట్ గ్జేవియర్స్ పీజీ కాలేజ్, శ్రీదేవి ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్‌లు కూడా ఉన్నాయి.
అపర్ణా న్యూలాండ్స్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా విమానాశ్రయం చేరుకునేందుకు 42 నిమిషాల సమయం పడుతుంది. ఇక క్యూ సిటీ, విప్రో సర్కిల్ రోడ్‌కు 15 నిమిషాలు గచ్చిబౌలికి 20 నిమిషాలు పడుతుంది. లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు 18 నిమిషాలు, విప్రో క్యాంపస్ -2కు 18 నిమిషాలు, రైతు నేత్రం సూపర్ మార్కెట్‌కు 12 నిమిషాలు, రత్నదీప్ సూపర్ మార్కెట్‌కు 14 నిమిషాలు, డీ మార్ట్ సూపర్ మార్కెట్‌కు 14 నిమిషాల సమయం పడుతుంది.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది













Click it and Unblock the Notifications