న్యూయార్క్‌లో గ్రాండ్ గాలా - FIA స్వాతంత్య్ర వేడుకలు గ్రాండ్ సక్సెస్..!!

న్యూయార్క్:అమెరికాలోని ప్రసిద్ధ 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్' (FIA) ఆధ్వర్యంలో న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ మరియు న్యూ ఇంగ్లాండ్ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిసాయి. 'సిప్రియాని వాల్ స్ట్రీట్' వేదికగా 'భారత్ బియాండ్ బార్డర్స్ 2.0' పేరుతో నిర్వహించిన గ్రాండ్ గాలా ఈవెంట్ విశేషంగా ఆకట్టుకుంది. భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం మరియు అమెరికా 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రతిష్టాత్మక వేడుకను ఏర్పాటు చేశారు.

ఈ వేడుకకు రాయబారులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, స్పాన్సర్లు, సమాజ శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భారత కాన్సులేట్ జనరల్, బన్సాల్ ఫౌండేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి వ్యవస్థాపక స్పాన్సర్లను నిర్వాహకులు ప్రత్యేకంగా గౌరవించారు. హెరిటేజ్ ఆర్ట్స్ అకాడమీ కళాకారులు ప్రదర్శించిన 'రాగ్ కిర్వాణి' సంగీత విభావరి, ఇరు దేశాల జాతీయ గీతాల ఆలాపన ప్రేక్షకులను మైమరిపించింది.

bharat-beyond-borders-2-0-pooja-hegde-adivi-sesh-and-taarak-mehta-stars-at-fia-gala

ప్రత్యేక ఆకర్షణగా సినీ ప్రముఖుల సందడి:
FIA ఛైర్మన్ అంకుర్ వైద్య, అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లిల ప్రసంగాల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తాయి. బ్రాడ్‌వే శైలి నృత్యాలు, ప్రీతి పటేల్ ఆలపించిన 'గోకుల్ ధామ్ అన్‌ప్లగ్డ్' సంగీత ప్రదర్శన, మారియాచి బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినీ తారలు పూజా హెగ్డే (ఫైర్‌సైడ్ చాట్ పాల్గొన్నవారు), అడివి శేష్, అవినాష్ తివారీతో పాటు 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' బృందం ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.

న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీలు పంపిన వీడియా సందేశాలను ప్రదర్శించారు. చివరిగా న్యూయార్క్ సిటీ మేయర్ కార్యాలయ ప్రతినిధి దిలీప్ చౌహాన్ అధికారిక ప్రకటనను అందజేయగా, సృష్టి కౌల్ నరులా కృతజ్ఞతా పూర్వక ప్రసంగంతో వేడుకలు దిగ్విజయంగా ముగిసాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+