ఫిలిం ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం..భారత్ మండపంలో సినిమా,ఏఐ,కళల సందడి

తమ గుండెల్లోని భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించే సినీ ప్రేమికుల కలల వేదిక "ఫిలిం ఎక్స్‌పో ఇండియా 2026" దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రఖ్యాత భారత్ మండపంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆగస్టు 26 నుండి 30 వరకు జరిగే ఈ ఐదు రోజుల సుదీర్ఘ వేడుక కేవలం ఒక పరిశ్రమ ప్రదర్శన మాత్రమే కాదు..ఇది సినిమా,కళ,ఏఐ సాంకేతికత,సరికొత్త ఆలోచనలు,మానవ సృజనాత్మకత కలబోసిన ఒక అద్భుత ప్రయాణం.భారతదేశపు విభిన్న సంస్కృతులను కథల రూపంలో ప్రపంచానికి పరిచయం చేసే సృష్టికర్తలను,పెట్టుబడిదారులను ఒకే చోటికి చేర్చిన భావోద్వేగ వేదిక ఇది.

ఈ సమ్మేళనం మొదటి రోజే ఎందరో కళాకారుల హృదయాలను హత్తుకుంది.చిత్ర పరిశ్రమకు దిశానిర్దేశం చేసిన ప్రముఖులు విందు దారా సింగ్,సందీప్ మార్వా,నందితా దాస్,పంకజ్ పరాశర్,వివేక్ వాస్వానీ వంటి ప్రతిభావంతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.సినిమా వెనుక ఉండే శ్రమను,మానవ జీవితాలను అది ప్రభావితం చేసే విధానాన్ని వారు పంచుకున్నారు.కేవలం వ్యాపారంగా కాకుండా, సినిమాను శ్వాసగా భావించే వారందరికీ ఈ ప్రారంభోత్సవ వేడుక ఒక సరికొత్త ఆశను,ఊపిరిని అందించింది.

film-expo-india-2026-begins-in-new-delhi-with-cinema-ai-art-and-technology-in-focus

కథల ప్రయాణం.. సాంకేతికత ప్రవాహం
ఈ వేడుకలో "ది నెక్స్ట్ 5000 స్క్రీన్స్"అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగానో కదిలించింది.మోడరేటర్ ఆశిష్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ గోష్ఠిలో నందితా దాస్,రాహుల్ రావైల్ వంటి దిగ్గజాలు పాల్గొన్నారు.మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కథలు ఎలా రూపాంతరం చెందాలో వారు వివరించారు.ఎమోషన్స్ తెరపై మరింత లోతుగా పండించేందుకు సరికొత్త స్క్రీన్స్ ఏ విధంగా ఉపయోగపడుతాయో తెలియజేశారు.కథతో ప్రేక్షకుడికి ఉన్న పేగు బంధాన్ని ఈ వేదిక గుర్తుచేసింది.

సినిమా ముచ్చట్లతో పాటు పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ దియా మీర్జా పాల్గొన్న సుస్థిరాభివృద్ధి కార్యక్రమాలు ఎంతో ఆలోచింపజేశాయి.కళాకారుల మనోభావాలను ప్రతిబింబించేలా పదివేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన "బియాండ్ ది కాన్వాస్"ఆర్ట్ ఎక్స్‌పో వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది.మొదటి రోజు ముగింపులో అనూప్ జలోటా,మాలిని అవస్థి నేతృత్వంలో జరిగిన సాంప్రదాయ భక్తి సంగీత రాత్రి అందరి మనసులకు గొప్ప సాంత్వన చేకూర్చింది. కళల కలయికగా సాగుతున్న ఈ ప్రదర్శన ఆగస్టు 30 వరకు కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+