వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్: ఏడవ రోజు ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియ అంశాలపై చర్చ

Google Oneindia TeluguNews

జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 7వ రోజున పలు ఆసక్తికర అంశాలపై చర్చ జరుగుతుంది. భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియ, మిడిల్ ఈస్ట్‌లో సవాళ్లు, వీడీ సావర్కర్ గొప్పతనం గురించి చర్చ జరుగుతుంది.

Recommended Video

JLF 2022 : Where Stones Speak: Rana Safvi In Conversation With Anirudh Kanisetti | Oneindia Telugu

అత్యంత ప్రాచుర్యం పొందిన రచయితలు దౌత్యవేత్తలు ఈ చర్చలో పాల్గొంటారు. వీరిలో ఒమర్ సైఫ్ ఘోబాష్, నవ్‌దీప్ సూరి తమీజ్ అహ్మద్‌లు నవతేజ్ సర్నతో చర్చలో పాల్గొంటారు. మిడిల్ ఈస్ట్‌ సమస్యలు సవాళ్లపై వీరు చర్చిస్తారు. ఈ చర్చలో సమస్యలపై పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు భవిష్యత్తులో అక్కడి ప్రజలకు ఎలాంటి భరోసా కల్పించాల్సి ఉంటుందనే అంశంపై కూడా మాట్లాడతారు.

Jaipur Literature Festival: Whats in store for people on day 7 of literary extravaganza?

సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మదన్ బి.లోకూర్, ప్రముఖ రచయిత బీజేపీ అధికార ప్రతినిధి గురు ప్రకాష్ పాశ్వాన్‌, మాజీ ఎన్నికల ప్రధానాధికారి నవీన్ బి చావ్లాలు సంయుక్తంగా ఓ సెషన్‌లో పాల్గొని చర్చిస్తారు. వీరంతా ఎన్నికల ప్రక్రియ, భారత్‌ ప్రజాస్వామ్య వ్యవస్థపై లోతుగా విశ్లేషిస్తారు. వీరు ప్రముఖ విద్యావేత్త విజయ్ టంఖాతో రాజకీయ, ఎన్నికల ప్రక్రియ, విజయాపజయాలపై చర్చిస్తారు. విజయ్ గోఖలే జ్యోతి మల్హోత్రాలు ఆసియా దేశాల రాజకీయ, ఆర్థిక, వ్యూహ ప్రతివ్యూహాలు, బలబలాలపై చర్చిస్తారు. భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాత్మకమైన నిర్మాణాలు చేపట్టాలనే అంశంపై చర్చిస్తారు.

Jaipur Literature Festival: Whats in store for people on day 7 of literary extravaganza?

ఇక వీడీ సావర్కర్ జీవితం, వారసత్వంపై ఇటీవలి కాలంలో వచ్చిన పుస్తకాలపై కూడా చర్చ జరుగుతుంది. రచయిత మరియు చరిత్రకారుడైన విక్రమ్ సంపత్ రాసిన సావర్కర్ పుసక్తం పై చర్చ జరుగుతుంది. సావర్కర్ ఎలాంటి విప్లవం తీసుకొచ్చారన్న అంశాన్ని ఈ సందర్భంగా మాట్లాడతారు. జర్నలిస్టు, రచయిత రాజకీయ విశ్లేషకులు ఉదయ్ మహుర్‌కర్ రాసిన వీర్ సావర్కర్: ది మ్యాన్ హు కుడ్ హావ్ ప్రివెంటెడ్ పార్టిషన్ పుస్తకం పై మాట్లాడుతారు.

Jaipur Literature Festival: Whats in store for people on day 7 of literary extravaganza?

ఆరవ రోజు రౌండప్

జైపూర్‌లోని క్లార్క్ ఆమెర్‌లో భూమిపై అతిపెద్ద సాహిత్య మహోత్సవం ప్రారంభమైంది. మార్నింగ్ మ్యూజిక్ వినేందుకు చాలామంది పోటీపడి ముందుగానే వచ్చి వేదిక వద్ద కూర్చున్నారు. ప్రారంభ సెషన్ ఆహ్లాదకరమైన సంగీతంతో ప్రారంభమైంది. ఉజ్వల్ నగర్ బృదంచే రాగ్ మియా కి తోడి మ్యూజిక్‌తో కార్యక్రమం ప్రారంభమైంది. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొని ప్రదర్శన ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక ప్రారంభోత్సవ ఉపన్యాసంను రచయిత హరీష్ త్రివేది ఇచ్చారు.

Jaipur Literature Festival: Whats in store for people on day 7 of literary extravaganza?

ఇక కరోనాతో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారని చెప్పారు రచయిత, ఫెస్టివల్ కో డెరైక్టర్ విలియమ్ డాల్‌రింపుల్. ఎక్కువగా ఇబ్బంది పడ్డవారు మాత్రం కళాకారులని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌తో వీరి జీవితం దుర్బరంగా మారిందని చెప్పారు. కానీ ఇప్పుడు అంతా సక్రమంగా ఉన్నందున తిరిగి మంచిరోజులు వచ్చాయని చెప్పుకొచ్చారు. తాను జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు భారత్‌కు యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న షాంబీ షార్ప్.భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడి కళలు, సంస్కృతులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు.

ఇక మీరు కూడా ఈ Jaipur Literature Festivalలో పాల్గొనాలంటే రిజిస్టర్ అయ్యేందుకు వెబ్‌సైట్‌ను సందర్శించండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X