Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tata ACE Pro:డ్రైవింగ్‌లో భారతదేశపు తదుపరి కార్గో విప్లవం

పరిచయం చేస్తున్నాం Tata ACE Pro - భారతదేశపు అత్యంత చవకైన నాలుగు చక్రాల మినీ ట్రక్ - ఇప్పుడు అత్యంత దృఢంగా పెట్రోల్, బై ఫ్యూయల్ మరియు ఎలక్ట్రిక్ రూపాలలో మీ ముందుకు వచ్చింది. మొదలు పెట్టేందుకు అయినా, మరో మెట్టు ఎక్కేందుకు అయినా, మీ ప్రయాణంలో ఎల్లప్పుడూ మీతోపాటే ఉంటూ, ఈ చిన్న ట్రక్ మీ పెద్ద కలలను సాకారం చేస్తుంది.
వేగంగా మారుతున్న నగర సరుకు రవాణా ప్రపంచంలో, పరిమాణం, వేగం మరియు నిలకడ ఎంతో కీలకమైనవి. ఈ-కామర్స్ మరింత విస్తృతమవుతోంది. ఆఖరి మైలు రాయి వరకు కూడా చేరుకోగలిగే డెలివరీలు ఆధునిక కాల వాణిజ్యంలో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో చురుకైన, సమర్ధవంతమైన, భవిష్యత్తు అవసరాలు సరిపోయే వాహనాల అవసరం ఎంతైనా ఉంది.

అందుకే Tata ACE Pro ప్రవేశించింది. ఇది భవిష్యత్తు తరం స్మాల్ కమర్షియల్ వెహికల్ (SCV). అతి తక్కువ కర్బన ఉద్గారాలతో, పర్యావరణ హితంగా ఉంటూనే, చక్కటి పనితీరు చూపించే వాహనం. పరిమాణంలో చిన్నదైనా, పనితీరులో గొప్పది. ACE Pro అనేది టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వారి గర్వకారణమైన ఆవిష్కరణ. భారతదేశంలో చివరి మైలు వరకు చేరే వాహనాల శ్రేణిలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించబోతోంది.

ఇప్పటికే అనుభవం ఉన్నవారికైనా, లేదా మొదటిసారి వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఔత్సాహికులకైనా.. నేటి సరుకు రవాణా రంగంలో వేగంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా ACE Pro వాహనాలు అత్యంత అద్భుతంగా నిర్మించబడ్డాయి. ఇవి పెట్రోల్, బై ఫ్యూయల్ ( పెట్రోల్+CNG) మరియు ఎలక్ట్రిక్ శ్రేణుల్లో లభిస్తాయి.

Meet Tata ACE Pro The Affordable 4-Wheel Mini Truck in Petrol Bi-Fuel amp amp EV

ఘన వారసత్వానికి నూతన రూపం

సుమారు రెండు దశాబ్దాల క్రితం, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ తొలి ఏస్‌ను పరిచయం చేసింది. ఇది భారతదేశ మినీ ట్రక్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఈ వాహనాలు 25 లక్షలమందికి పైగా వ్యాపారవేత్తలకు ఉపాధి కల్పించి, సొంత కాళ్లపై నిలబడేలా చేశాయి. ఇప్పుడు the ACE Proతో, ఆ వారసత్వం మరింత బలపడుతుంది. కేవలం ₹3.99 లక్షల ప్రారంభ ధరతో లభించే టాటా ఏస్ ప్రో భారతదేశపు అత్యంత అనువైన నాలుగు చక్రాల మినీ ట్రక్, ఉత్తమ పనితీరు, పురోగతితో లాభాలు గడించేలా రూపొందించడింది.

" కొత్త తరం ఔత్సాహికులకు, వ్యాపార రంగంలో కలలు సాకారం చేసుకోవాలనుకొనే వారికి ఊతమిచ్చేలా, ఒక కొత్త దృక్పథంతో మా వారసత్వాన్ని సరికొత్త Tata ACE Pro, రూపంలో ముందుకు తీసుకెళ్తున్నాం " అని టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ గిరీష్ వాఘ్ పేర్కొన్నారు.

మీ వేరియంట్ ఎంచుకోండి : పెట్రోల్, బై-ఫ్యూయల్ లేక ఎలక్ట్రిక్
బహుముఖ అసరాలకు అనుగుణంగా టాటా ఏస్ ప్రో ప్రధానంగా మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
పెట్రోల్ : 694cc సీసీ శక్తివంతమైన ఇంజన్, 30bhp పవర్ మరియు 55Nm టార్క్ యొక్క కలయిక సాధారణ సరుకు రవాణాలో ఎంతో ముఖ్యమైన శక్తి మరియు మైలేజీ మధ్య సమతుల్యతను పెంపొందిస్తాయి.
బై ఫ్యూయల్ (పెట్రోల్ +CNG): ఖర్చు మితంగా ఉండాలనే ఆలోచించే వ్యాపారులను దృష్టిలో ఉంచి రూపొందించిన ఈ వేరియంట్, CNG మోడ్‌లో 26bhp మరియు 51Nm టార్క్‌తోపాటు, మరింత రేంజ్ కోసం ఏర్పాటు చేసిన 5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ అదనపు ఆకర్షణ.
• ఎలెక్ట్రిక్ (EV): 38bhp, 104Nm టార్క్‌తోపాటు ఒక ఛార్జ్‌తో 155 కిలోమీటర్ల రేంజ్ వంటి లక్షణాలతో, ACE Pro EV పట్టణ సరుకు రవాణాకు ఎంతో అనువైనదిగా చెప్పచ్చు. వీటితోపాటుగా IP67 ప్రామాణికతతో వచ్చిన బ్యాటరీ మరియు మోటార్, అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా సౌకర్యవంతమైన పనితీరును అందిస్తాయి.

భారీ సామర్థ్యపు పేలోడ్
ఈ శ్రేణిలోనే అత్యుత్తమమైన 750 కిలోల పేలోడ్ సామర్థ్యంతో పాటు, 6.5 అడుగుల (1.98 మీటర్ల) లోడ్ డెక్కలిగి ఉన్న ACE Pro, చిన్న స్థాయి రవాణా అవసరాలకు గట్టి బలాన్ని అందిస్తుంది. ఫ్యాక్టరీ నుండే ఫ్లాట్ బెడ్ లేదా హాఫ్ డెక్ ఎంపికలతోపాటు, కంటైనర్, రీఫర్ మరియు మున్సిపల్ బాడీ ఫిట్‌మెంట్స్‌కు అనువుగా ఉంటూ, ఈ-కామర్స్ నుండి కోల్డ్ చైన్ సరఫరాల వరకు అన్ని అవసరాలకూ సరిపోయే వాహనం.

అత్యుత్తమ కంఫర్ట్ కోసం - డ్రైవర్ ప్రాధాన్య డిజైన్
నగర వీధుల్లో అత్యధిక పనిగంటలకు, అధ్వానంగా ఉండే రహదారుల్లో ప్రయాణాలకు అత్యుత్తమ కంఫర్ట్ అవసరం. అందుకే ACE Pro లో విశాలమైన, కూర్చునేందుకు అనువైన క్యాబిన్, కావలసినంత స్టోరేజీ ఉంటుంది. దీంతోపాటు AIS096 ప్రమాణాలు కలిగిన క్రాష్ టెస్ట్ భద్రతతో రూపొందింది. వీటితోపాటు డ్రైవర్లు దిగువ తెలిపిన ప్రయోనాలు పొందవచ్చు.
• డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
• ఆప్షనల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
• ఎక్కువ సమయం డ్రైవింగ్ కోసం సౌకర్యవంతమైన సీటింగ్
ఇవి కేవలం సౌకర్యాలు మాత్రమే కాదు, ఒత్తిడి తగ్గిస్తూ, భద్రతను పెంపొందిస్తూ, లాభదాయకంగా నిలిచేందుకు ఉపయోగపడే సాధనాలు.
వ్యాపారం ముందడుగుకు టెక్నాలజీ తోడు
ACE Pro కు టాటా మోటార్స్ వారి ఫ్లీట్ ఎడ్జ్ ప్లాట్‌ఫాం సేవల మద్దతు ఉంటుంది. భారతదేశవ్యావ్తంగా 8 లక్షల పైచిలుకు దీనికి కనెక్ట్ అయి ఉన్నాయి. దీంతో ప్రయోజనాలివీ:
• ఎప్పటికప్పుడు వాహనం స్థితిగతుల పర్యవేక్షణ
• డ్రైవరు పనితీరు తెలుసుకునే వీలు
• ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అలర్ట్స్
• రివర్స్ పార్కింగ్ ఆసిస్టెన్స్, గేర్ షిఫ్ట్ అడ్వయిజర్ వంటి నావిగేషన్ ఫీచర్లు.

వీటివల్ల వాహన యజమానులు మరియు రవాణదారులకు సమయం, ఇంధనం ఆదా అవ్వటంతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయి.

జాతీయ స్థాయి నెట్‌వర్క్, అవరోధాలు లేని యాజమాన్యం
దేశవ్యాప్తంగా 2,500కి పైగా సర్వీస్ మరియు స్పేర్స్ అవుట్‌లెట్స్, అలాగే దూర ప్రాంతాలకూ విస్తరించిన స్టార్ గురు నెట్‌వర్క్ ద్వారా, టాటా మోటార్స్ వినియోగదారులకు నిరంతర సేవలను అందిస్తుంది. ఈవీ ప్రత్యేక వర్క్ షాప్స్, 24x7 రహదారి సహాయం వంటివి వ్యాపారం ఎలాంటి అవరోధాలు లేకుండా సజావుగా జరిగేందుకు తోడ్పడతాయి.
ఆర్థిక సహాయం కావాలా? టాటా అగ్రగామి బ్యాంకులు మరియు ఎన్‌.బి.ఎఫ్.సి.లతో కలిసి ఈ అవకాశాలు అందిస్తోంది:
• వేగవంతమైన లోన్
• అనువైన ఈఎంఐ ప్లాన్లు
• అవసరాలకు అనుగుణంగా ఫైనాన్స్ ఆప్షన్లు
ఇంకా, మీరు కోరుకున్న ACE Pro వేరియంట్‌ను టాటా డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్లీట్ వెర్స్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ బుక్ చేయవచ్చు, లేదా దేశవ్యాప్తంగా ఉన్న 1,250కి పైగా టాటా కమర్షియల్ వాహన డీలర్‌షిప్‌లను కూడా సందర్శించవచ్చు.

ఆధునిక భారతావని అవసరాలకు తగినట్టుగా
ACE Pro శ్రేణి, ముఖ్యంగాఎలక్ట్రిక్ వేరియంట్ (EV) ఈ రోజుల్లో వేగంగా పెరుగుతున్న చివరి మైలు వరకు డెలివరీ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడింది. కూరగాయలు, కొరియర్ల సరఫరా నుండి సంచార విక్రయాలు, శీతల వస్తు రవాణా వరకూ. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తల విభిన్న అవసరాలను తీర్చగల సామర్థ్యం దీని సొంతం.
"బహుళ ఇంధన వేరియంట్లు, మేటి ధరలో లభ్యత, మన్నికైన డ్రైవింగ్ అనుభవంవంటివన్నీకలగలిపి, Tata ACE Pro అన్నిరంగాల్లోనూ మెరుగైన సేవలను అందిస్తుంది " అని టాటా మోటార్స్ SCVPU విభాగం వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ శ్పినాకీ హాల్దార్ తెలిపారు.

అనేక కలలకు ఏకైక వేదిక
మీరు డెలివరీ వ్యాపారం మొదలుపెట్టబోయే గిగ్ వర్కర్ కావచ్చు, లేదా ఓ వాహనం ద్వారా సంస్థను అభివృద్ది పథంలో నడిపిస్తున్న వారు కూడా కావచ్చు.. ఎలాంటి వారైనా, అందరికీ కూడా Tata ACE Pro ఒక నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తుంది. వివిధ ఇంధన ఎంపికలు, స్మార్ట్ టెక్నాలజీ మరియు పరిశ్రమలోనే అత్యంత ఉత్తమమైన సర్వీసుతో.. ఇది కేవలం ఒక ట్రక్కు మాత్రమే కాదు, అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు ఏర్పడిన వేదిక.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+