దాతృత్వం అంటే సాయం కాదు.. స్వయం సమృద్ధిని పెంచడమే: AVPNలో ప్రీతి అదానీ

ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 13వ ఏవీపీఎన్ (AVPN) అంతర్జాతీయ సదస్సులో ఆదానీ ఫౌండేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రీతి ఆదానీ కీలక ప్రసంగం చేశారు. సహాయం అంటే కేవలం తాత్కాలికంగా ఆకలి తీర్చడం కాదని, ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడేలా స్వయం సమృద్ధిని కల్పించడమే నిజమైన దాతృత్వమని ఆమె నిరూపించారు. దాతలు నిధులివ్వడానికే పరిమితం కాకుండా, గ్రామాలు, ప్రాంతీయ సంస్థల సామర్థ్యాన్ని పెంచడానికి 'క్యాపిటల్ ఫర్ కెపాసిటీ' (సామర్థ్య బలోపేత పెట్టుబడి) అందించాలని ఆమె ప్రతిపాదించారు.

దాతృత్వం అంటే సాయం కాదు.. స్వయం సమృద్ధిని పెంచడం
ఈ సందర్భంగా మహారాష్ట్రలోని చుర్డి గ్రామానికి చెందిన కిరణ్ హరింఖడే విజయగాథను ప్రీతి ఆదానీ ప్రస్తావించారు. ఆదానీ ఫౌండేషన్ పశుసంవర్ధక పథకం ద్వారా మెరుగైన ఆవుల పెంపకం, పశువైద్య సేవలపై శిక్షణ పొందిన కిరణ్.. నేడు రోజుకు ఏకంగా 25 నుంచి 28 లీటర్ల పాలు విక్రయిస్తూ మహిళా డెయిరీ సహకార సంఘంలో కీలక భాగస్వామిగా ఎదిగారు. దీని ద్వారా లభించిన స్థిరమైన రాబడితో ఆమె తన పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తూ గ్రామీణ మహిళా ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచారు.

philanthropy-is-about-building-self-reliance-not-just-giving-aid-preeti-adani-at-avpn

ఆదానీ ఫౌండేషన్ 1996 నుండి దేశంలోని 22 రాష్ట్రాల్లో గల 7,200 గ్రామాల పరిధిలోని దాదాపు 1.3 కోట్ల మంది ప్రజలకు విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి రంగాల్లో నిరంతరం సేవలు అందిస్తోంది. సామాజిక మార్పుల కోసం స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ 'వందే భారతం' వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. దీనికి మరింత బలాన్ని చేకూరుస్తూ, సామాజిక సేవ కోసం ఆదానీ కుటుంబం అంకితం చేసిన రూ. 60,000 కోట్ల మహా నిధి దేశంలో నూతన విప్లవానికి బాటలు వేస్తోంది.

ఈ నిధుల ద్వారా ముంబై, అహ్మదాబాద్‌లలో అత్యాధునిక 'ఆదానీ హెల్త్ సిటీస్', బీహార్‌లోని పిర్‌పైంటిలో 200 పడకల ఆసుపత్రి శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. పర్యావరణ మార్పులు, కృత్రిమ మేధస్సు వంటి సరికొత్త సవాళ్లను అధిగమిస్తూ, విక్షిత్ భారత్ 2047 స్వప్నం సాకారం కావడానికి భావితరాలకు స్వావలంబన (ఆత్మనిర్భరత) నేర్పడమే ఏకైక మార్గమని డాక్టర్ ప్రీతి ఆదానీ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+