అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగీత ప్రియ..రండి ఆమె జీవితంలో వెలుగులు నింపుదాం..!
అందరికీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. కొందరికి కాలం కలిసొస్తే మరికొందరికి ఆ కాలమే శాపంగా మారుతుంది. కొందరి జీవితాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించేందుకు చాలా మంది ప్రయత్నించి సక్సెస్ అవుతుంటారు. కొందరు మాత్రం ప్రయత్నించి విఫలమవుతుంటారు. ఇలాంటి గాధే చెన్నైకి చెందిన సంగీత ప్రియది.
సంగీత ప్రియ జీవిత ప్రయాణం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. అడుగడుగున అడ్డంకులే.ఎన్నో సవాళ్లు. వీటన్నిటినీ ఆమె అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది.చెన్నైలోని చింతాద్రిపేట్‌కు చెందిన సంగీత ప్రియ నిత్యం సందడిగా కనిపించే నగర జీవన శైలిలో పెరిగింది.రోజు అనేక ఇబ్బందులు సవాళ్లు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ తన సంకల్పంతో అధిగమిస్తూ శ్రీ కల్యాణి బాలికల ప్రభుత్వ పాఠశాలలో విద్యను పూర్తిచేసింది. తన కుటుంబాన్ని సంరక్షించుకోవాలనే దృఢమైన సంకల్పంతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని అధిగమించి విద్యను పూర్తి చేసింది.

ఇక నర్సింగ్ శిక్షణ పొందుతున్న సమయంలో సంగీత ప్రియకు అప్పటికే ఉన్న కష్టాలు చాలనక ఆరోగ్యపరమైన సమస్య తలెత్తింది. ఆమె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ వ్యాధితో షాక్‌కు గురైన సంగీత ప్రియ భయపడలేదు. కష్టాలు, సవాళ్లు తనకు కొత్త కాదని ఇది మరొక సమస్యగా భావించి అధిగమించాలని ప్రయత్నిస్తోంది.
సంగీత ప్రియ తండ్రి ఒక సామాన్య ఆటో డ్రైవర్. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం వారిది. రోడ్లు సరిగ్గా లేకపోవడంతో ఆటోకు ఎప్పుడు సమస్యలు తలెత్తేవి. దీంతో ఆటో నడపని రోజులు కుటుంబం గడవడం కష్టంగా మారింది.మరోవైపు సంగీత ప్రియ అనారోగ్యం అతనిని వెంటాడుతూ ఉంది. ఇదిలా ఉంటే సంగీత ప్రియ తల్లి శాంత లక్ష్మీ అంగవైకల్యం ఆ కుటుంబానికి మరో సమస్య.ఇది ఆ కుటుంబం ఆర్థిక స్థితిగతులను మరింతగా చిదిమేస్తోంది.
ఇన్ని సవాళ్లు అడ్డంకులున్నప్పటికీ కూడా సంగీత ఈ మధ్యే తన నర్సింగ్ కోర్సును పూర్తి చేసి ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఉద్యోగంలో చేరింది.ఇది కాస్త ఊరటనిచ్చినప్పటికీ... తనకున్న అనారోగ్యం తన పనిపై ప్రభావం చూపుతోంది. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోంది. స్థానిక డాక్టర్ దగ్గరకు వెళ్లగా మెడికల్ పరిభాషలో లార్జ్ ఓస్టియమ్ సకండమ్ ఏసీడీ అనే వ్యాధి బయటపడింది. ఈ వ్యాధి నయం చేయాలంటే పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్నది.

కేవలం సర్జరీకి మాత్రమే రూ.2 లక్షల ఖర్చు అవుతుండగా... ఐసీయూ ,హాస్పిటల్ స్టే, ఆపరేషన్ తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్స్ , మందులకు అదనంగా ఖర్చు అవుతుంది. అయితే సంగీత కుటుంబం ఇంత ఖర్చును మోయలేదు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ కష్టకాలంలో వారు దాతల నుంచి సహాయం కోరుతున్నారు.మీరు విరాళంగా ఇచ్చే ప్రతి రూపాయి సంగీత జీవితంలో వెలుగు నింపుతుంది. విరాళంగా వచ్చే డబ్బులతో చికిత్స చేయించుకుని తిరిగి తన కలలను సాకారం చేసుకునేందుకు సహాయపడుతుంది. అందరం కలిసి కట్టుగా చేయి చేయి కలిపితే సంగీతను ఈ కష్టం నుంచి గట్టెక్కించొచ్చు. అదే సమయంలో ఆమె కలలను సాకారం చేసే దిశగా తోడ్పాటు అందించొచ్చు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications