కూతురిపై రేప్ యత్నం చేసిన భర్తను చంపిన భార్య

Woman hacked husband to death for trying to rape daughter
చెన్నై/ముంబై: తాగిన మత్తులో యవ్వనంలో ఉన్న కూతురిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన భర్తను ఓ మహిళ చంపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే 43 ఏళ్ల వ్యక్తి మద్యం సేవించి గత రాత్రి ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత కూతురిపై అత్యాచారానికి ప్రయత్నించాడు.

దాంతో భర్తపై భార్య దాడి చేసి అతన్ని చంపేసింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫోన్ చేసి సంఘటన గురించి చెప్పింది. వారికి 19 ఏళ్ల కుమారుడు, 9 నుంచి 13 ఏళ్ల వయస్సు గల ముగ్గురు కూతుర్లు ఉన్నారు.

ఇదిలా వుంటే, మహారాష్ట్రలోని చర్కోప్‌నకు చెందిన ఓ మహిళ వారం క్రితం తన ఆరు నెలల పాపతో సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త వైవాహికేతర సంబంధం అంటగట్టడంతో కలత చెందిన 23 ఏళ్ల మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది.

పోలీసులు ఆమె భర్తను, అత్తవారింటి సభ్యులను అరెస్టు చేశారు. ఆ మహిళను రంజనగా గుర్తించారు. ఆమె తన పాప గాయత్రితో కలిసి ఈ నెల 14వ తేదీన ఇల్లు వదిలి వెళ్లిపోయింది. దాంతో భర్త కిషన్ మిస్సింగ్ కింద ఫిర్యాదు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions