పెళ్లైనా తనను తాకలేదని భర్తపై ఓ భార్య ఫిర్యాదు

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వలవనూర్‌కు చెందిన సెల్వం తమిళనాడు సచివాలయంలో ప్రజాపనుల శాఖలో పనిచేస్తున్నారు. ఇతని వయస్సు ముప్పై అయిదేళ్లు. ఆయన తిరుక్కోవిలూర్ తాలూకా, తిరుమంగళానికి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల ఝాన్సీ రాణిని జూన్ 1న పెళ్లి చేసుకున్నారు.
అప్పటినుంచి ఒక్కసారి కూడా భర్త తనను ముట్టుకోలేదంటూ ఝాన్సీ రాణి విల్లుపురం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని గురించి ఎప్పుడు అడిగినా ఏవో కుంటిసాకులు చెబుతున్నాడని ఆమె ఆరోపించారు. అతని మగతనం పైనే తనకు అనుమానంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
దీంతో సెల్వంపై మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ రేవతి కేసు నమోదు చేశారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నారు. అయితే తన భర్త మగతనంపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications