డియు విద్యార్థినులపై రేప్: అక్రమ సంబంధంపై అడిగితే..

దీంతో భార్యాభర్తలు తరచూ ఘర్షణ పడేవారు. దీంతో ఆగ్రహించిన వెంకటేశన్ కత్తెరతో భార్య సెల్విని ఇష్టం వచ్చినట్లు పొడవడంతో మృతి చెందింది. ఈ విషయమై సెల్వి తండ్రి సుబ్రమణియం ఆరంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేశన్ వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా, తన కుమార్తెను కట్నం తీసుకురమ్మని వేధించేవాడని ఆరోపించారు. పోలీసులు విచారణ జరిపి, వెంకటేశన్‌ను అరెస్టు చేశారు. ఆర్‌డీవో కేసును విచారణ చేస్తున్నారు.
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారం జరిపారనే ఆరోపణపై ఇద్దరు యువకులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు, నిందితులు స్నేహితులేనని పోలీసులు తెలిపారు. నిందితులను అజిత్, విక్కీలుగా గుర్తించామన్నారు. బవానా ప్రాంతంలో శనివారం ఈ దురాగతానికి పాల్పడిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు పట్టుబడగా సునీల్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు.
అతని కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశామన్నారు. అత్యాచారానికి గురైన యువతులిద్దరూ బి.ఏ. చదువుతున్నారని, స్నేహితులైన సునీల్, విక్కీలతో కలిసి షికారుకు వెళ్లిన వీరిపై స్నేహితులే అత్యాచారం జరిపారన్నారు. శీతల పానీయంలో మత్తుమందు కలిపిచ్చారని, దాన్ని తాగిన యువతులిద్దరు అపస్మారకస్థితిలో ఉండగా వారిపై అత్యాచారం జరిపారని చెప్పారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారని, బాధితులు విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఫిర్యాదు చేశారన్నారు.
వారు ఇచ్చిన సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా కనువిప్పు కలగడంలేదని, ఎంతగా కౌన్సిలింగ్ ఇచ్చినా వారి తీరు మారడంలేదని పోలీ సులు అన్నారు. స్నేహితులమంటూ పరిచయం పెంచుకొని ఇలా అత్యాచారాలకు ఒడిగడుతున్న సంఘటనలు డీయూలో తరచూ చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications