రేప్ చేసి మహిళను కిరాతకంగా హత్య చేశారు

మల్లమ్మ భర్త ఐదు నెలల క్రితం ప్రమాదవశాత్తు ఒంటికి నిప్పంటుకుని మృతి చెందాడు. అదే సమయంలో కూతురు జన్మించిన సందర్భంగా మల్లమ్మ పుట్టిళ్లు చిల్కూర్‌కు వచ్చి తల్లిగారింట్లోనే ఉంటుంది. మల్లమ్మ తల్లి చంద్రకళ పది రోజుల క్రితం తన కోడలు వద్దకు వెళ్లింది.
తమ్ముడు మల్లేశ్ ప్రతి రోజు మాదిరిగానే నగరంలో పని నిమిత్తం ఉదయం వెళ్లాడు. తండ్రి సైతం ఇంట్లోలేడు. మధ్యాహ్నాం 12 గంటల సమయంలో ఇంట్లోంచి పిల్లల అరుపులు వినిపించాయి. గమనించిన స్థానికులు ఇంటి వద్దకు వెళ్లి చూడగా ఇంటి తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. దాంతో స్థానికులు ఇంటి పైకి ఎక్కి వరండాలో నుంచి లోపలికి చూడగా మల్లమ్మ రక్తం మడుగులోపడి ఉంది. విషయాన్ని స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
మల్లమ్మ మృతదేహం పడి ఉన్న అనవాళ్లను పట్టి చూస్తే హాతురాలిపై అత్యచారం జరిపి హత్య చేసి ఉంటారనే అనుమానం వ్యక్తం మవుతోంది. ఇంట్లో పెనుగులాట జరిగిన అనవాళ్లు, గోడలకు రక్తం మరకలు ఉన్నాయి. మల్లమ్మ ముఖంపై విచక్షణ రహితంగా కొట్టారు. ముఖం పూర్తిగా రక్తంతో తడిసిపోయింది. హత్య చేసినవారు ఇంటి లోపల నుంచి గడియ పెట్టి పైన కాలిగా ఉన్న వరండాల్లో నుంచి బయటకి పారిపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హంతకులను పట్టుకునేందుకు జాగీలాలను రప్పించారు.
జాగీలాలు హతురాలి ఇంట్లోంచి పక్క ఇంట్లోకి వెళ్లాయి. అక్కడి నుంచి గ్రామంలోని బస్టాప్ వద్దకు వెళ్లి తిరిగి వచ్చాయి. దీంతో పాటు క్లూస్ టీమ్ సభ్యులు సైతం హత్యకు సంబంధించి వివరాలు సేకరించారు. అనుమానితుల వేలిముద్రలు తీసుకున్నారు. హత్య చేసింది స్థానికులా, స్థానికేతరులా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మెడలోనే బంగారు గొలుసు తెగిపోయి పక్కన పడి వుంది.












Click it and Unblock the Notifications