'భక్షక' భటుడు: మహిళపై అత్యాచారయత్నం, కేసు

దోమ స్టేషన్‌లో కానిస్టేబుల్ శంకర్‌గౌడ్ ఆ సమయంలో ఆమె ఫోన్ నంబరు తీసుకొన్నాడని, ఆ రోజునుంచి తనను వేధింపులకు గురి చేసేవాడని, తీవ్ర పదజాలంతో దూషించేవాడ ని బాధితురాలు చెబుతోంది. మంగళవారం రాత్రి బాధితురాలు నిద్రిస్తుండగా అత్యాచారం చేయడానికి శంకర్ గౌడ్ ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి అతడిని బంధించి పోలీసులకు సమాచారమందించారు. దోమ ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి వచ్చి శంకర్‌గౌడ్‌ను స్టేషన్‌కు తరలించారు.
ప్రస్తుతం శంకర్‌గౌడ్ గుండెపోటుతో బాధ పడుతూ హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ శంకర్‌గౌడ్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజకుమారి తెలిపారు.
కేసుల విషయం ఉంటే పగలు వచ్చి కలిసి మాట్లాడాలి తప్ప రాత్రి వేళలో వెళ్లడం సరికాదని పీసీ శంకర్‌పై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కాగా, శంకర్‌గౌడ్‌ను వెంటనే సస్పెండ్ చేసి అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బుధవారం సీపీఎం, డీబీఎఫ్ నాయకులు దోమ పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.












Click it and Unblock the Notifications