కూతురిని రెండేళ్ల పాటు రేప్ చేసిన తండ్రి పరారీ

48 ఏళ్ల వయస్సు గల నిందితుడు రంగారెడ్డి జిల్లా కుల్కచర్లకు చెందినవాడు. నిందితుడి రెండో కూతురైన బాధితురాలు తన తల్లితో కలిసి వచ్చి పోలీసులకు మంగళవారండు ఫిర్యాదు చేసింది. గత రెండేళ్లుగా తన తండ్రి తనపై లైంగిక దోపిడీకి పాల్పడుతున్నాడని ఆ అమ్మాయి ఫిర్యాదు చేసింది.
అతను సోమవారం అమ్మాయిపై అత్యాచారం జరిపినట్లు, బాధితురాలు ఆ విషయాన్న తన అక్కకు చెప్పిందని, అక్క ఆ విషయాన్ని తల్లికి చెప్పిందని పోలీసులు అంటున్నారు. తనపై అత్యాచారం చేసిన విషయాన్ని బయటపెడితే చంపేస్తానని బాధితురాలు ఫిర్యాదులో చెప్పింది.
వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అత్యాచారం కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications