కూతురుపై తండ్రి అత్యాచారం, ఆపై కిడ్నాప్ డ్రామా

నల్లగొండ జిల్లా మునుగోడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన కొండ యాదయ్య 20 రోజుల క్రితం మునుగోడు మండలం కొకటికల్ గ్రామానికి వచ్చాడు. బొంతలు కుట్టుకుంటూ అక్కడే బస్ షెల్టర్‌లో జీవనం సాగిస్తున్నాడు. సోమవారం తెల్లవారు జామును తన నాలుగేళ్ల పెద్ద కూతురిని గ్రామం బయట గల పొలానికి తీసుకుని వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత బస్ షెల్టర్‌కు తిరిగి వచ్చి తన కూతురిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుని పోయారని గ్రామస్తులను, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. తన కూతురిని వెతికి తనకు అప్పగించాలని పోలీసులను కోరాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
మంగళవారం ఒంటిగంట ప్రాంతంలో పత్తి చేలో పోలీసులకు బాలిక కనిపించింది. తీవ్ర గాయాలతో, రక్తస్రావంతో బాధపడుతున్న బాలికను నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వెళ్లి వైద్య పరీక్షలు జరిపించారు. అమ్మాయిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షలో తేలింది. దీంతో పోలీసులు విచారణ జరిపారు తానే లైంగిక దాడికి పాల్పడినట్లు తండ్రి అంగీకరించాడు.












Click it and Unblock the Notifications