మతి స్థిమితం లేని మహిళపై గ్యాంగ్‌రేప్: ఇద్దరు అరెస్ట్

పోలీసుల కథనం ప్రకారం.. ముగ్గురు నిందితులు గత కొన్ని రోజులుగా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్తున్నారు. మానసిక స్థిమితం సరిగా లేకపోవడంతో బాధిత మహిళ హార్బర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతోంది. ఆ సమయంలోనే ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు.
మంగళవారం రాత్రి కూడా నవాల్ క్యాంటీన్ వద్ద నిద్రిస్తున్న ఆ మహిళపై మళ్లీ ఈ ముగ్గురు దండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో బాధిత మహిళ కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పారిపోతున్న ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించారు.
ఇద్దరు నిందితులను పట్టుకున్న స్థానికులు, దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని వి పోలయ్య (45), కె పోలరాజు (35)గా గుర్తించారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు నిందితులను తమదైన శైలిలో విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులపై 376(డి) సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం కెజిహెచ్ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications