నిర్బంధించి వారం రోజులు అమ్మాయిపై అత్యాచారం

వివరాలు ఇలా ఉన్నాయి - తుంగతుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తన అక్క వద్దకు వెళ్తున్నానని చెప్పి ఈ నెల 1వ తేదీ అర్వపల్లికి వచ్చింది. అక్కడ తన అక్కను కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. కానీ ఆ బాలిక ఇంటికి వెళ్లకుండా నార్కట్‌పల్లి మండలంలోని చెరువుగట్టు శ్రీజడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లింది.
చెరువుగట్టు దేవాలయం వద్ద ఆమెకు కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం వట్టేముల గ్రామానికి చెందిన కొర్రెపు రమేష్ పరిచయమయ్యాడు. అతను మాయమాటలు చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకుని వెళ్లి నిర్బంధించాడు. వారం రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
చివరకు బాలిక తప్పించుకుని ఇంటికి చేరింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని సోమవారం అరెస్టు చేసి తుంగతుర్తి కోర్టులో హాజరు పరిచినట్లు సిఐ పార్థసారథి చెప్పారు. నిందితుడు రమేష్ చెర్వుగట్టు దేవాలయం వద్ద కొబ్బరికాయల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు.












Click it and Unblock the Notifications