Home / Photos
మోడ్రన్ డ్రెస్‌లో మెరుపులు.. తెలుగు పిల్ల జోరు మాములుగా లేదుగా!
వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉంది తెలుగు బ్యూటీ దివి వాద్త్యా. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా సుపరిచితమైంది. అప్పటివరకు పెద్దగా తెలియని దివి, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి తనదైన శైలితో అతి తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. హౌస్ నుండి బయటకొచ్చాక నటిగా అవకాశాలు దక్కించుకుంటూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతోంది. గ్లామర్ తో పాటు నటనతో ఆకట్టుకుంటుది.
1/10
Photo Credit: https://www.instagram.com/actordivi/?g=5
Share
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 దివి కెరీర్ లో ఒక మైలురాయి వంటిది. ఒక సామాన్య పోటీదారుగా హౌస్ లోకి అడుగుపెట్టిన ఆమె, తన బోల్డ్ నెస్, నిజాయితీ, అందంతో ప్రేక్షకులను మెప్పించింది
2/10
Photo Credit: https://www.instagram.com/actordivi/?g=5
Share
హౌస్ లో ఎలాంటి విషయానికైనా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా, స్పష్టంగా చెప్పే ఆమె తత్వం ఎంతో మందికి నచ్చింది. తోటి కంటెస్టెంట్ లతో కలిసిపోతూ, టాస్కులలో తన వంతు ప్రయత్నం చేస్తూ, హౌస్ లో తన ఉనికిని గట్టిగా చాటుకుంది. ఆమె అందానికి, చిరునవ్వుకు ఎంతో మంది అభిమానులు అయ్యారు.
3/10
Photo Credit: https://www.instagram.com/actordivi/?g=5
Share
బిగ్ బాస్ తర్వాత దివికి సినిమా రంగం నుండి పిలుపు వచ్చింది. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసినా, క్రమంగా ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించే అవకాశం దక్కించుకుంది.
4/10
Photo Credit: https://www.instagram.com/actordivi/?g=5
Share
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించిన పాన్ ఇండియా చిత్రం 'లైగర్' లో ఒక చిన్న, కానీ కీలకమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
5/10
Photo Credit: https://www.instagram.com/actordivi/?g=5
Share
ఆ తర్వాత ఆమె వెబ్ సిరీస్ లలో కూడా నటించి ఓటీటీ ప్రేక్షకులకు చేరువైంది. 'మలయాళం ఫ్రమ్ వైజాగ్' (Malayalam from Vizag), 'ప్రేమ విమానం' (Prema Vimanam) వంటి వెబ్ సిరీస్ లలో ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది.
6/10
Photo Credit: https://www.instagram.com/actordivi/?g=5
Share
గ్లామరస్ పాత్రలతో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో కూడా నటించే ప్రయత్నం చేస్తోంది.
7/10
Photo Credit: https://www.instagram.com/actordivi/?g=5
Share
సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోషూట్స్, సినిమా అప్డేట్స్ తో అభిమానులను పలకరిస్తూ ఉంటుంది.
8/10
Photo Credit: https://www.instagram.com/actordivi/?g=5
Share
తన గ్లామరస్ ఫోటోలతో పాటు, తన పక్కింటి అమ్మాయి లాంటి రూపంతో కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. మోడలింగ్ రంగంలో కూడా కొనసాగుతూ పలు బ్రాండ్స్ కు ప్రచారం చేస్తోంది.
9/10
Photo Credit: https://www.instagram.com/actordivi/?g=5
Share
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు , మూడు చిత్రాలు ఉన్నాయి.

Click it and Unblock the Notifications