Amaha:మానసిక ఆరోగ్య సమస్యలకు చెక్..ఈ నగరాల్లో అందుబాటులోకి అమహ సేవలు..!

ఈ రోజుల్లో పని ఒత్తిడితోనో లేక ఇతర ఆరోగ్య సమస్యలతోనో చాలామంది మానసికంగా చితికిపోతున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోయాయి. అలాంటి మానసిక రుగ్మతతో బాధపడే వారికి నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని భావించారు ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ అమిత్ మాలిక్. ఈ క్రమంలోనే 2016లో అమహ(గతంలో ఇన్నర్ అవర్)మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు.

2019లో నేహా కిర్పాల్ సహ వ్యవస్థాపకురాలిగా చేరారు. ఈమె సామాజిక వ్యాపారవేత్త, గ్లోబల్ మెంటల్ హెల్త్ ప్రచారకర్తగా కూడా ఉన్నారు.ఇప్పటికే దేశంలో 2 కోట్ల మంది పలు వ్యసనాలు, సైకోసిస్, ఆత్మహత్యలు, స్వీయ హాని, ఇతర మానసిక వ్యాధులతో బాధపడుతుండగా..పుండు పై కారం చల్లినట్లుగా కోవిడ్ మరిన్ని ఆరోగ్య సవాళ్లను తీసుకొచ్చింది.

Amaha launches first 3 mental health centers in top 3 metro cities Delhi,Mumbai,bengaluru

గత ఏడేళ్లుగా మానసిక వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తూ భారతదేశ మానసిక ఆరోగ్య సంస్థల్లో అగ్రగామిగా అమహ నిలిచింది.ఆపదలో ఉన్న వ్యక్తులకు ఎమర్జెన్సీ పద్ధతిలో చికిత్స అందించి, చికిత్స చేయడంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తూ మంచి గుర్తింపు పొందింది.గత ఏడాదిలోనే 110 మంది మానసిక వైద్యులు, సైకియాట్రిస్ట్‌లతో కూడిన అమహ బృందం... 300కు పైగా నగరాల్లో,15 భాషల్లో 35వేలకు పైగా థెరపీ, సైకియాట్రీ సెషన్‌లను ఆన్‌లైన్‌లో అందించింది.

Amaha:

బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబైలలో నేరుగా వైద్యులు వచ్చి చికిత్స అందించేలా మూడు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మానసికంగా కృంగిపోయి ఉన్నవారికి, మానసిక రుగ్మతలున్న వారికి అవగాహన కల్పించేందుకు మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్‌, సత్వర చర్యలు లాంటివి ఉన్న డిజిటల్ యాప్‌ను అమహ ప్రవేశపెట్టింది.దీన్ని ప్రపంచ వ్యాప్తంగా 4.5 మిలియన్లు మంది డౌన్‌లోడ్ చేసుకుని ఆరోగ్యపరంగా లబ్ధి పొందుతున్నారు.

365 రోజులు 24/7 కాన్సెప్ట్‌తో అమహ పనిచేస్తుంది.ఇక్కడ అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ ఉంటారు. అంతేకాదు వారికున్న సమస్యల ఆధారంగా వారే సొంతంగా ఒక ప్రొఫెషనల్‌ను ఎంపిక చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.అమహ మొబైల్ యాప్ తీసుకొచ్చిన తక్కువ సమయంలోనే గూగుల్ ప్లే నుంచి బెస్ట్ యాప్ ఫర్ గుడ్ అవార్డు దక్కించుకుంది.

అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పండు ముదసలి వరకు నాణ్యమైన మానసిక చికిత్సను అందించి వారి కుటుంబాల్లో సంతోషం నింపాలన్న ఆలోచనతో మరో పేరుగాంచిన సంస్థను అమహ సంస్థ సొంతం చేసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్‌ కేంద్రంగా పనిచేస్తున్న చైల్డ్ అండ్ అడోల్సెంట్ మెంటల్ హెల్త్ ఇన్స్‌టిట్యూట్, చిల్డ్రన్ ఫస్ట్ అనే సంస్థను 2022లో అమహ టేకోవర్ చేసింది.ఈ సంస్థ 2008 నుంచి దాదాపుగా 12వేల మంది కుటుంబాలకు అండగా నిలుస్తోంది.ఇక దేశవ్యాప్తంగా ఆఫీసుల్లో, కాలేజీల్లో పలు వెల్ బీయింగ్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తూ 70వేల మందికి ఆరోగ్యపరంగా అండగా నిలుస్తోంది.

Amaha:

అమహ అనే ఈ ఆరోగ్య సంస్థను (అంతకుముందు ఇన్నర్ అవర్)2016లో ప్రముఖ మానసిక వైద్యులు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థాపకులు డాక్టర్ అమిత్ మాలిక్ స్థాపించారు. 2019లో సహ వ్యవస్థాపకురాలిగా శ్రీమతి నేహా కిర్పాల్ చేరారు. 110 మందితో కూడిన సైకియాట్రిస్టుల బృందం ఆన్‌లైన్‌లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా మానసిక రోగులకు చికిత్స అందించారు.

మరింత సమాచారం కోసం:

పాలక్ జైస్వాల్ |[email protected] |9682811524

పద్మా రావు |[email protected] | 9833180409

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+