ICL Fincorp: ఐసీఎల్ ఫిన్‌కార్ప్ ఎన్సీడీ ఇష్యూ .. ఎప్పుడు ప్రారంభం అంటే..!

ఐసీఎల్(ICL) ఫిన్‌కార్ప్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (NCD) ఇష్యూ 2025 జనవరి 8న ఓపెన్ అయింది. ఎన్సీడీ అంటే ఫిక్స్ డ్ రాబడి ఇచ్చే పెట్టుబడి పథకం. ఎన్సీడీలను ఈక్విటీ లేదా స్టాక్‌లుగా మార్చలేము. ప్రముఖ కంపెనీలు వీటిని జారీ చేస్తాయి. తాజాగా ఐసీఎల్ కార్ప్ ఎన్సీడీలు జారీ చేయనుంది. ఈ కంపెనీ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న NBFCలలో ఒకటిగా ఉంది. క్రిసిల్ BBB- స్థిరమైన రేటింగ్ ఉన్న కంపెనీ NCD తో పెట్టుబడిదారులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఇందులో పెట్టుబడి పెడితే 13.73% వరకు వడ్డీ వచ్చే అవకాశం ఉంది.

ఎన్సీడీ 2025 జనవరి 21వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. ఎన్సీడీలను ఒక్కొక్కటి రూ. 1,000 ముఖ విలువతో అందిస్తున్నారు. ఇందులో నాలుగు వేర్వేరు పథకాలు ఉన్నాయి. ఇందులో 10 పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. ఒక దరఖాస్తు దారుడు కనీసం రూ. 10,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో 11 నుంచి 13.01% మధ్య ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు ఇష్యూ ప్రాస్పెక్టస్‌ను డౌన్‌లోడ్ చేసుకుని చూడొచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను అదే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ICL Fincorp Non Convertible Debentures NCD issue to open on November 11

మరిన్ని విచారణల కోసం పెట్టుబడిదారులు తమ సమీప ఐసీఎల్ ఫిన్ కార్ప్ శాఖను సందర్శించవచ్చు లేదా 1800 31 33353కు కాల్ చేయవచ్చు అలాగే +91 85890 01187, +91 85890 20137, +9 85890 20186 నంబర్లను సంప్రదించవచ్చు. ఈ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులు ఐసీఎల్ ఫిన్‌కార్ప్ వ్యాపారం కోసం ఉపయోగించనుంది. బంగారంపై రుణాలు ఇవ్వనుంది. ఐసీఎల్ ఫిన్‌కార్ప్ కంపెనీని 32 సంవత్సరాల క్రితం స్థాపించారు. ఈ కంపెనీ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తోంది.

రుణ రంగంలో ఉన్న అవకాశంతో కంపెనీ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఐసీఎల్ ఫిన్‌కార్ప్ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ లో తన సేవలు అందిస్తోంది. ఐసీఎల్ ఫిన్‌కార్ప్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీ. ఈ కంపెనీ బంగారు రుణాలతోపాటు అనేక రకాల ఆర్థిక సేవలను అందిస్తుంది. కొనుగోలు రుణాలు, పెట్టుబడి ఎంపికలు, డబ్బు బదిలీ, విదేశీ మారకం, వ్యాపారం, రుణాలు, గృహ, ఆరోగ్య బీమా, జీవిత బీమా రంగంలో సేవలు అందిస్తోంది.

ఈ కంపెనీకి కె.జి. అనిల్ కుమార్ సీఎండీగా ఉన్నారు. శ్రీమతి ఉమా అనిల్ కుమార్ (వైస్ ఛైర్మన్, హోల్-టైమ్ డైరెక్టర్ & CEO)గా వ్యవహరిస్తున్నారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే కంపెనీ కొనసాగుతోంది. కంపెనీ మూడు దశాబ్దాలకు పైగా వినియోగదారుల విశ్వాసం, ఆర్థిక నైపుణ్యం, నిబద్ధతతో ముందుకెళ్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+