Molnupiravir:క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించేందుకు యశోద హాస్పిటల్స్‌కు డీసీజీఐ అనుమతి..!

కరోనా విజృంభిస్తున్న వేళ ఈ మహమ్మారి కట్టడికి పలు మెడిసిన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఔషధాలను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి డీసీజీఐ అనుమతులు ఇస్తోంది. తాజాగా మోల్‌నుపిరావిర్ అనే ఔషధంకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు హైదరాబాదులోని యశోద ఆస్పత్రికి అనుమతులు ఇచ్చింది. దీంతో నాట్కో ఫార్మాతో కలిసి యశోద హాస్పిటల్స్ సోమాజిగూడలోని యూనిట్‌లో కోవిడ్ పేషెంట్లపై ప్రయోగించనుంది. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ఇక్కడ నిర్వహిస్తారని యశోద హాస్పిటల్స్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.

మోల్‌నుపిరావిర్ మెడిసిన్‌ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించేందుకు తొలిసారిగా ఒక హాస్పిటల్‌కు ఇవ్వడం అది కూడా యశోద హాస్పిటల్‌ను డీసీజీఐ ఎన్నుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు యశోద మెడికల్ డైరెక్టర్ డాక్టర్ లింటయ్య అమిదల్య. కచ్చితంగా మోల్‌నుపిరావిర్ ఔషధం గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వల్ప తీవ్రత ఉన్న కోవిడ్ పేషెంట్లు మోల్‌నుపిరావిర్ మెడిసిన్ ద్వారా కోలుకుంటే కోవిడ్-19ను నియంత్రించడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. అంతేకాదు ఈ వ్యాధి మరింతగా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయొచ్చని అన్నారు. ఈ ట్రయల్స్ సక్సెస్ అయితే సామాన్యుడిపై పెను భారం తగ్గుతుందని స్పష్టం చేశారు డాక్టర్ లింగయ్య అమిదల్యా.

Molnupiravir drug : Yashoda hospitals recieve approval from DCGI to conduct Phase-3 clinical trails

క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా కోవిడ్ పేషెంట్లకు వాలంటరీగా 800 ఎంజీ డోసు రోజుకు రెండు సార్లు ఇస్తామని తెలిపారు. అయితే వారు హాస్పిటల్‌లో అడ్మిట్ కావాల్సిన పనిలేదని చెప్పారు. ఇది ఔట్ పేషెంట్ ఆధారిత క్లినికల్ ట్రయల్స్ కనుక హాస్పిటల్‌లో అడ్మిల్ అవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు ఐదవ రోజు,10వ రోజు, 15వ రోజున వైద్యులు పేషెంట్లను మానిటర్ చేస్తారని వెల్లడించారు.

Molnupiravir drug : Yashoda hospitals recieve approval from DCGI to conduct Phase-3 clinical trails

మోల్‌నుపిరావిర్ మెడిసిన్ ఇన్ఫెక్షన్ తగ్గిండమే కాకుండా వైరస్‌ కూడా వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుంది. అమెరికాలోని ఎమొరీ శాస్త్రవేత్తలు ఈ డ్రగ్ ఇచ్చి 24 గంటల పాటు అబ్జర్వ్ చేశారు. అయితే డ్రగ్ తీసుకున్న పేషెంట్‌లో తీవ్రమైన కోవిడ్ లక్షణాలను కట్టడి చేసిందని చెప్పారు. ఇక జంతువులపై కూడా దీన్ని ప్రయోగించగా ఒక జంతువు నుంచి మరో జంతువుకు వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగిందని శాస్త్రవేత్తలు చెప్పారు.

Molnupiravir drug : Yashoda hospitals recieve approval from DCGI to conduct Phase-3 clinical trails

యూకేలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ డ్రగ్‌ను 800 ఎంజీ డోసుతో రోజుకు రెండు సార్లు చొప్పున ఐదురోజుల పాటు ఇవ్వడం జరిగింది. మంచి ఫలితాలు ఇచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. అమెరికాలో కూడా రెండవ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా మోల్‌నుపిరావిర్ తీసుకున్న పేషెంట్లలో ఐదో రోజుకే కోవిడ్ నెగిటివ్ వచ్చినట్లు అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+