పతంజలికి ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఘనత.. AEO టైర్-2 సర్టిఫికేట్‌ సాధించి..

పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ మరో ఘనత సాధించింది. 78 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒక చారిత్రక మైలురాయిని అధిగమించింది. పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ AEO (ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్) టైర్-2 సర్టిఫికేట్‌ పొందింది. వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ (WCO), కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కస్టమ్స్, పతంజలి సంస్థకు ఈ సర్టిఫికేట్‌ ను అందజేశాయి. ఈ గుర్తింపు పతంజలి సంస్థ నిజాయితీ, పారదర్శకత, అంతర్జాతీయ మార్కెట్ లో భద్రత విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తుందని సూచిస్తుంది.

భారత్ లోని అతిపెద్ద కంపెనీల్లో చాలా తక్కువ సంస్థలకు మాత్రమే ఈ టైర్-2 హోదా లభించింది. FMCG రంగంలో ఇది కేవలం కొన్ని కంపెనీలకు మాత్రమే దక్కింది. ఇప్పుడు పతంజలి సంస్థ పేరు కూడా ఈ జాబితాలో చేరింది. ఈ సర్టిఫికేట్ కారణంగా పతంజలి సంస్థకు 28కు పైగా అంతర్జాతీయ వాణిజ్య ప్రయోజనాలు సమకూరనున్నాయి. వీటిలో డ్యూటీ డిఫర్డ్ పేమెంట్, బ్యాంక్ గ్యారంటీ మినహాయింపు, డైరెక్ట్ పోర్ట్ డెలివరీ (DPD), 24x7 క్లియరెన్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

ఒక కంపెనీ నాణ్యత, నిజాయితీ, పారదర్శకత, దేశ ప్రయోజనాలకు అందించే కృషికి ఈ సర్టిఫికేట్ నిదర్శనం కానుంది. పతంజలి తమ నాణ్యత, నిబద్ధత, స్వదేశీ స్ఫూర్తితో ఈ ఘనత సాధించింది. పతంజలి కుటుంబంతో పాటు ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమైన క్షణం అని స్వామి రామ్ దేవ్ బాబా అన్నారు. విశ్వసనీయత, పోటీ తత్వం, నాణ్యతలో పతంజలి నిరంతరం కొత్త ప్రమాణాలను సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. 'మేక్ ఇన్ ఇండియా' ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి వేగంగా ముందుకు సాగుతామన్నారు. మరోవైపు పతంజలి కుటుంబం, ఉద్యోగులు, వినియోగదారుల సమిష్టి కృషి ఫలితమే ఈ విజయమని ఆచార్య బాలకృష్ణ వ్యాఖ్యానించారు. AEO టైర్-2 సర్టిఫికేట్ తమ కార్యకలాపాల పారదర్శకత, నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాలకు నిదర్శనమని ఆయన తెలిపారు.

Patanjali Foods Limited Secures AEO Tier-2 Certificate from WCO

ఈ విజయం తమ ఎగుమతి కార్యకలాపాలను పెంచి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఆచార్య బాలకృష్ణ వివరించారు. ఈ గౌరవం తమ సంస్కృతి, ఆయుర్వేదం, స్వదేశీ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపును పొందడంలో సహాయపడుతుందని అన్నారు. పతంజలిని ప్రపంచంలోని అగ్రశ్రేణి FMCG బ్రాండ్‌ లలో ఒకటిగా స్థాపించి, భారత్ ఎగుమతులను కొత్త శిఖరాలకు చేర్చాలనేది తమ లక్ష్యం అని ఆచార్య బాలకృష్ణ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+