షాకింగ్.. POCSO కేసులో ఎస్ఐ అరెస్ట్
పోలీస్ అంటే ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలబడే వ్యక్తిగా మనం చూస్తుంటాం. కానీ.. ఓ వ్యక్తి మాత్రం అలాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉండి కూడా.. కీచక పర్వం సాగించాడు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగిన ఈ షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. POCSO కేసులో ఓ పోలీస్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. మైనర్ బాలికపై ఆ అధికారి దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
ఉత్తర కన్నడ జిల్లా హొన్నవార్ తాలూకాలోని మన్ కీ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా విధులు నిర్వర్తిస్తున్న అభినందన్ అనే వ్యక్తిని POCSO కేసులో భట్కాల్ సిటీ పోలీస్ స్టేషన్ సిబ్బంది అరెస్ట్ చేశారు. అధికారుల సమాచారం ప్రకారం ఎస్ఐ అభినందన్.. ఎల్లాపూర్ తాలూకాకు చెందిన ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో యువతి ఫిర్యాదు మేరకు భట్కాల్ సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వెంటనే పోలీసులు.. ఎస్ఐ అభినందన్ ను కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

గతంలోనూ కర్ణాటకలో ఇలాంటి కేసు నమోదైంది. అమృతహళ్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించే ప్రవీణ్ అనే ఎస్ఐ.. విచారణ పేరుతో మైనర్ అబ్బాయిలను లైంగికంగా వేధించినట్లు తేలింది. ఈ మేరకు అతను POCSO కేసు కింద అరెస్ట్ అయ్యాడు. ఓ కేసులో మైనర్ బాయ్స్ ను కస్టడీలోకి తీసుకున్న ఎస్ఐ ప్రవీణ్.. వారిని ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి లైంగికంగా చిత్రహింసలకు గురి చేసినట్లు తేలింది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications